Advertisementt

సునీత పెళ్లి తేదీ వచ్చేసింది!

Sat 26th Dec 2020 03:12 PM
singer sunitha,ram,wedding date,january,9th  సునీత పెళ్లి తేదీ వచ్చేసింది!
Singer Sunitha Wedding date locked సునీత పెళ్లి తేదీ వచ్చేసింది!
Advertisement
Ads by CJ

సింగర్ సునీత మల్లి పెళ్లి అనుకున్నప్పటినుండి.. సునీత పెళ్లి విషయంలో ఏదో ఒక న్యూస్ మీడియాలో నానుతూనే ఉంది. సింగర్ సునీత తనకు కాబోయే వరుడిని పరిచయం చెయ్యడం చెయ్యడమే.. నిశ్చితార్ధం చేసుకుని మరీ పరిచయం చేసింది. మ్యాంగో యూట్యూబ్ అధినేత రామ్ ని సునీత రెండో వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. అయితే మీడియాలో వచ్చిన వార్తలను బట్టి సునీత పెళ్లి ఈ రోజో రేపో అంటే డిసెంబర్ 26 లేదా 27 తేదీల్లో జరగబోతుంది అంటూ ప్రచారం జరిగినా సునీత మాత్రం ఎందుకు మీకీ కంగారు. నేను పెళ్లి డేట్ చెప్పేవరకు ఎలాంటి డేట్స్ సృష్టించకండి అంటూ సీరియస్ కూడా అయ్యింది. .. అలాగే సునీత ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ కూడా సోషల్ మీడియాలో బాగా హైలెట్ అయ్యాయి.

ఆ సెలెబ్రేషన్స్ కి నితిన్ హోస్ట్ చెయ్యడం బాగా పాపులర్ అయ్యింది. అయితే తాజాగా సునీత పెళ్లి డేట్ బయటికి వచ్చింది. సింగర్ సునీత - రామ్ ల రెండో వివాహానికి తేదీ ఫిక్స్ అయ్యింది. 2021 కొత్త సంవత్సరం జనవరి 9 న సునీత పెళ్లి కూతురుగా ముస్తాబు కాబోతుంది. సునీత - రామ్ ల వివాహం కొద్దిమంది సన్నహితుల మధ్యనే హైదరాబాద్ లో సింపుల్ గా జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈరోజు శనివారం సునీత ఇండస్ట్రీలోని పలువురు సన్నిహితులకి ప్రీ వెడ్డింగ్ పార్టీ ఇవ్వబోతున్నట్టుగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

Singer Sunitha Wedding date locked:

Singer Sunitha - Ram >Pre-Wedding Party Invitation

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ