Advertisementt

సమంత గ్రాండ్ గానే ప్లాన్ చేసిదండోయ్!

Sat 26th Dec 2020 10:56 AM
samantha,christmas,celebration,akkineni family  సమంత గ్రాండ్ గానే ప్లాన్ చేసిదండోయ్!
Samantha Grand Christmas Celebrations సమంత గ్రాండ్ గానే ప్లాన్ చేసిదండోయ్!
Advertisement
Ads by CJ

అక్కినేని సమంత క్రిస్మస్ ని ఎంత గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంటుందో అందరికి తెలిసిన విషయమే. నాగ చైతన్య ని హిందూ సంప్రదాయంలోనూ, క్రిష్టియన్ సంప్రదాయంలోనూ పెళ్లి చేసుకున్న సమంత  క్రిస్మస్, జనవరి 1 వేడుకల కోసం ఎప్పుడు వెకేషన్ ప్లాన్ చేసుకునేది. అలాగే తన ఇంట్లో క్రిస్మస్ ట్రీ కోసం కష్టపడి డెకరేట్ చేస్తుండేది. అయితే ఈ ఏడాది మాత్రం సమంత ఇంట్లోనే క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించింది. క్రిస్మస్ పండగని తన ఇంట్లో అక్కినేని ఫ్యామిలీ మధ్యన సమంత గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

చైతన్య, సమంత, నాగార్జున, అమల, అఖిల్, సుమంత్, సుశాంత్, సుప్రియ తో పాటుగా నాగార్జున అన్నగారు..ఆయన భార్య, నాగ సుశీల, నాగ్ మేనల్లుళ్లు, మేనకోడలు ఇలా నాగేశ్వరరావు ఫ్యామిలీ మొత్తాన్ని సమంత గేదెర్ చేసి క్రిస్మస్ పార్టీ ఇచ్చింది. ఆ పార్టీ లో దిగిన అక్కినేని ఫ్యామిలీ పిక్ ఇప్పుడు సాంఘీక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. మరి అక్కినేని కోడలా మజాకా అన్నట్టుగా ఉంది.. ఈ క్రిస్మస్ పిక్ చూస్తే. అక్కినేని ఫ్యామిలిలో ప్రతి ఒక్కరిని ఈ పార్టీ కోసం తీసుకొచ్చింది సమంత. అది నాగ్ కొడలంటే అంటున్నారు అక్కినేని అభిమానులు.

Samantha Grand Christmas Celebrations:

Samantha Grand Christmas Celebration with Akkineni Family

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ