Advertisementt

సెలబ్రిటీస్ క్రిస్మస్ ట్రీస్ చూస్తారా..!

Fri 25th Dec 2020 07:43 PM
chiru,mega family,ram charan,niharika,mahesh,ntr sons,christmas celebration  సెలబ్రిటీస్ క్రిస్మస్ ట్రీస్ చూస్తారా..!
Celebrities Christmas Celebrations సెలబ్రిటీస్ క్రిస్మస్ ట్రీస్ చూస్తారా..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ సెలబ్రిటీస్ తమ తమ ఇళ్లలో క్రిస్మస్ ట్రీస్ పెట్టడమే కాదు.. క్రిస్మస్ సెలబ్రేషన్స్  ని ఓ రేంజ్ లో జరుపుకున్నారు. మెగాస్టార్ చిరు దగ్గరనుండి జూనియర్ ఎన్టీఆర్ వరకు తమ ఇళ్లల్లో క్రిస్మస్ ట్రీస్ పెట్టుకుని అభిమానులకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు. చిరు ఇంట్లో ఏకంగా క్రిస్మస్ పార్టీ ని రామ్ చరణ్ - ఉపాసనలు హోస్ట్ లు గా మారి గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసారు. ప్రస్తుతం మెగాస్టార్ క్రిస్మస్ ట్రీ, అలాగే మెగా క్రిస్మస్ సెలెబ్రేషన్స్  ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇక ఎన్టీఆర్ అయితే ఎప్పుడూ ఫ్యామిలీని మీడియాకి దూరంగానే ఉంచుతాడు. మొన్నామధ్యన ఎయిర్ పోర్ట్ లో భార్య పెద్దకొడుకు అభయ్ రామ్ తో కనబడిన తారక్.. క్రిస్మస్ సందర్భంగా తన క్యూట్ సన్స్ అభయ్ రామ్, భార్గవ్ రామ్ ల ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసాడు. మరి ఎప్పుడూ కొడుకులని సోషల్ మీడియాకి దూరంగా ఉంచే ఎన్టీఆర్ ఇప్పుడు తన కొడుకుల ఫొటోస్ షేర్ చెయ్యడంతో తారక్ ఫాన్స్ ఖుష్ అవుతున్నారు.

మహేష్ అయితే తన కొడుకు గౌతమ్, సితారలు ఫోటో తో పాటుగా తమ ఇంట్లో పెట్టిన క్రిస్మస్ ట్రీ ఫోటో ని షేర్ చేసాడు. ప్రస్తుతం ఆ పిక్ వైరల్ అయ్యింది.

ఇక కొత్త జంట, మెగా కపుల్ నిహారిక - చైతన్య ల ఫస్ట్ క్రిస్మస్ వేడుకలు కొణిదెల వారి ఇంట ఘనంగా జరిగాయి. మెగా కజిన్స్ అందరూ క్రిస్మస్ పార్టీలో ఎంజాయ్ చేసిన ఫొటోస్ ఒక ఎత్తైతే.. కొత్త జంట నిహారిక - చైతన్యల రొమాంటిక్ పిక్స్ సోషల్ మీడియాలో క్యూట్ క్యూట్ గా చక్కర్లు కొడుతున్నాయి. ఇక సమంత క్రిస్మస్ సెలెబ్రేషన్స్, కీర్తి సురేష్ క్రిస్మస్ ట్రీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన పిక్స్ లో ఉన్నాయి.

Celebrities Christmas Celebrations:

Chiru and mega family Christmas Celebrations

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ