రజినీకాంత్ కొత్త సినిమా షూటింగ్ అన్నాత్తై సెట్స్ లో ఆరుగురికి కరోనా సోకడంతో.. రజినీ కూడా కోవిడ్ టెస్ట్ చేయించుకోగా ఆయనకి నెగెటివ్ రావడంతో అన్నాత్తై షూటింగ్ కి బ్రేకిచ్చేసి రజినీకాంత్ హైదరాబాద్ లో హోమ్ క్వారంటైన్ కి వెళ్లిపోయారు. అప్పటినుండి రజినీకాంత్ హైదరాబాద్ లోనే ఉన్నారు. తాజాగా రజినీకాంత్ తీవ్ర అస్వస్థతో జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో జాయిన్ అవడంతో ఆయన అభిమానులు ఆందోళనలో మునిగిపోయారు.
ప్రస్తుతం రజినీకాంత్ జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో డాక్టర్స్ అబ్జర్వేషన్ లో ఉన్నారు. అయితే రజినీకాంత్ హై బిపి తో బాధపడుతున్నట్లుగా తెలుస్తుంది. రజినీకాంత్ అభిమానులు ఆందోళన చెందవద్దని.. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టుగా చెబుతున్నప్పటికీ.. రజిని ఫాన్స్ లో ఆందోళన తగ్గడం లేదు. గతంలో కూడా రజినీ ఆరోగ్యంపై అనేకరకాల పుకార్లు షికార్లు చేసినా.. రజినీ ఎప్పటికప్పుడు వాటికీ క్లారిటీ ఇచ్చేవారు. కానీ ఇప్పడు రజినీ ఏకంగా హాస్పిటల్ పాలవడంతో ఆయన అభిమానులు కంగారు పడుతున్నారు.