Advertisementt

బన్నీకి అత్తగా.. చేస్తుందట!

Fri 25th Dec 2020 10:39 AM
vanitha vijay kumar,bunny,ntr movies,ramyakrishna  బన్నీకి అత్తగా.. చేస్తుందట!
She as Bunny's Aunt! బన్నీకి అత్తగా.. చేస్తుందట!
Advertisement
Ads by CJ

కోలీవుడ్ లో ఈమధ్యన వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్ అనగానే వనితా విజయ్ కుమార్ గుర్తుకు వస్తుంది. పెళ్లిళ్ల విషయంలోనే కాదు.. తండ్రితో ఆస్థి తగాదాలతోను వనిత విజయ్ కుమార్ మీడియాలో నానుతుంది. ముచ్చటగా మూడు పెళ్లిళ్లు పెటాకులైనా మరో పెళ్ళికి సిద్దమవుతున్నా అంటూ హింట్ ఇచ్చిన వనిత విజయ్ కుమార్ ఈ మధ్యనే తండ్రి విజయ్ కుమార్ మంచివాడు కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆస్థి మొత్తం తన నుండి లాక్కున్నాడని, తన తండ్రి విలన్ అని, తనకి తన తండ్రే అన్యాయం చేశాడంటూ రోడ్డెక్కిన వనితా విజయ్ కుమార్ ఇప్పుడు మరో సారి హాట్ టాపిక్ అయ్యింది. ఈసారి అల్లు అర్జున్ తనకి లైన్ వేసాడంటూ కొత్త విషయాన్ని చెప్పుకొచ్చింది.

మెగాస్టార్ ఫ్యామిలీ చెన్నై లో ఉన్నప్పుడు మెగాస్టార్ ఫ్యామిలీతో తమకి మంచి సంబంధాలు ఉండేవని.. వాళ్ళింట్లో ఫంక్షన్స్ కి మేమంతా వెళ్లేవాళ్లమని.. ఓసారి చిరు గారి సినిమా ఓపెనింగ్ లో నేను మ్యాంగో కలర్ డ్రెస్‌లో వచ్చినప్పుడు బన్నీ సూపర్ స్టైలిష్ గా తయారై నాకు లైన్ వేసాడు. నేను బన్నీ కన్నా చాలా పెద్దదాన్ని అంటూ బన్నీ తనకి లైన్ వేసిన విషయాన్ని బయట పెట్టింది. అలాగే బన్నీ డాన్స్ అంటే చాలా ఇష్టమని.. బన్నీ సినిమాల్లో బన్నీకి అత్త కేరెక్టర్ లో నటించాలని ఉందంటూ తన కోరికను బయటపెట్టింది. అంతేకాదు.. జూనియర్ ఎన్టీఆర్ కి పెద్ద ఫ్యాన్ ని అంటుంది. ఎన్టీఆర్ సినిమాలో అవకాశం వస్తే నటిస్తానని.. అసలు ప్రస్తుతం రమ్యకృష్ణ చేస్తున్న పవర్ ఫుల్ పాత్రల లాంటి పాత్రలు చెయ్యాలని ఉంది అంటూ దర్శకనిర్మాతలనూ వనితా విజయ్ కుమార్ లైన్ లో పెడుతుంది.

She as Bunny's Aunt!:

Vanitha Vijay Kumar wants to act in Bunny and Ntr Movies

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ