Advertisementt

బాలకృష్ణ తర్వాత రకులే!

Thu 24th Dec 2020 10:28 PM
krish,sam jam show,balayya,rakul  బాలకృష్ణ తర్వాత రకులే!
Rakule after Balakrishna! బాలకృష్ణ తర్వాత రకులే!
Advertisement
Ads by CJ

బాలకృష్ణ తో గౌతమి పుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ బయోపిక్ సినిమాల్ని తెరకెక్కికించిన దర్శకుడు క్రిష్.. తాజాగా బాలయ్య డెడికేషన్ గురించి ఓ షోలో చెప్పాడు. తాను తెరకెక్కించిన సినిమాల నటీనటులందరిలో టైమ్, పంక్చువాలిటీ విషయంలో బాలకృష్ణ పర్ఫెక్ట్ అంటున్నాడు. షూటింగ్ 6 గంటల కి అంటే.. బాలకృష్ణ 6 గంటలకే సెట్స్ లో ఉంటారు. అంత టైమ్, పంక్చువాలిటీని మెయింటింగ్ చేస్తారు. మళ్ళీ అదే క్వాలిటీ రకుల్ ప్రీత్ లో చూసా అంటున్నాడు దర్శకుడు క్రిష్. రకుల్ ప్రీత్ తో క్రిష్ కొండనవల ఆధారంగా సినిమా తెరకెక్కించాడు. కొండనవల పుస్తకం చదివినప్పుడు నిద్రపట్టలేదని.. వెంటనే ఆ సినిమాలో రకుల్ ప్రీత్ ని నటింపచేయాలని ఆమెకి ఫోన్ చేసానని చెబుతున్నాడు.

హీరో హీరోయిన్స్ గా రకుల్ - వైష్ణవ తేజ్ లని ఈ సినిమా చేసందుకు ఒప్పించి లాక్ డౌన్ లో కేవలం 45 రోజుల్లోనే ఈ సినిమా పూర్తి చేసానని చెబుతున్నాడు క్రిష్. అయితే తాను పని చేసిన హీరోయిన్స్ అందరిలో రకుల్ ప్రీత్ తో పనిచెయ్యడం నచ్చింది అని.. అంత టైమ్, పంక్చువాలిటీ ఉన్న హీరోయిన్ రకుల్ ప్రీత్ అంటూ చెప్పుకొచ్చాడు క్రిష్. రకుల్ ప్రీత్ సింగ్ చాలా డిసిప్లేన్ ఉన్న హీరోయిన్ మాత్రమే కాదు.. ప్రొఫెషన్ పట్ల డెడికేషన్ ఉన్న హీరోయిన్, షూటింగ్ టైం కి ఆమె సెట్ లో ఉంటుంది.. అంటూ రకుల్ ప్రీత్ ని ఆకాశానికెత్తేసాడు క్రిష్.

Rakule after Balakrishna!:

Director Krish about Balayya and Rakul's time punctuality

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ