కరోనా తో మూగబోయిన సినిమా ఇండస్ట్రీ ని మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ అంటూ మేలుకొల్పుతున్నాడు. ఈ నెల మొదటి వారం వరకు థియేటర్స్ బంద్ వలన సినిమాలేవీ రిలీజ్ కాలేకపోయాయి. ఈ ఏడెనిమిది నెలలు ఓటిటీల రాజ్యం నడిచినా.. ఇప్పుడు థియేటర్స్ హడావిడి మొదలు కాబోతుంది. కరొనకి భయ పడకుండా నా సినిమాని థియేటర్స్ లో విడుదల చేస్తున్నట్లుగా సాయి ధరమ్ ఎనౌన్స్ చెయ్యగానే ఇండస్ట్రీలో కదలిక వచ్చింది. గత రెండు రోజులుగా సాయి ధరమ్ సోలో బ్రతికే సో బెటర్ ప్రమోషన్స్ తో ఇండస్ట్రీ కళకళలాడుతుంది.
ఇప్పటివరకు అక్కడక్కడా మాత్రమే హడవిడిగా కనబడిన సినిమా పరిశ్రమ ఇప్పుడు థియేటర్స్ దగ్గర బ్యానేర్స్ హడావిడి, పేపర్స్ లో పోస్టర్స్ హడావిడి, మీడియాలో యాడ్స్ హడావుడితో నిజంగా నిండుగా కనబడుతుంది. ఇప్పటివరకు సాయి ధరమ్ తో పోటీకి దిగే హీరోలెవరూ ఇప్పుడు పోటీ పడడం లేదు. అందుకే మెగా హీరో సోలోగానే సోలో బ్రతుకే సో బెటర్ తో థియేటర్స్ లో దున్నేయ్యబోతున్నాడు. కేవలం సోకాలోగా వస్తున్నాడని.. ఒంటరిగా గా లేడు. సినిమా ఇండస్ట్రీలోని పెద్ద పెద్ద స్టార్స్ సాయి ధరమ్ కి వెల్ కం చెబుతున్నారు. ప్రభాస్ అయితే థియేటర్స్ ఎక్స్పీరియన్స్ చెయ్యండి.. అంటూ సాయి తేజ్ కి సపోర్ట్ చెయ్యడం, మిగతా సినిమా పరిశ్రమ అంత సాయి తేజ్ కి గ్రాండ్ వెల్ కం చెబుతున్నారు.
సోలో బ్రతుకే సో బెటర్ ట్రైలర్ చూస్తే మెగా మేనల్లుడు ఖచ్చితంగా హిట్ కొట్టెయ్యడం ఖాయంలాగే కనబడుతుంది. నిజంగా కరోనా విషయంలో వెనక్కి తగ్గకుండా సోలో బ్రతుకే సో బెటర్ తో థియేటర్స్ లోకి వస్తున్న సాయి ధరమ్ తేజ్ భారీ హిట్ కొట్టాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.