Advertisementt

త్రివిక్రమ్ సర్ తీన్మార్ ఆడొద్దు ప్లీజ్!

Wed 30th Dec 2020 11:53 AM
trivikram srinivas,pawan kalyan,ayyappanum koshiyum remake  త్రివిక్రమ్ సర్ తీన్మార్ ఆడొద్దు ప్లీజ్!
Fear in Mega Fans with Pawan and Trivikram sentiment త్రివిక్రమ్ సర్ తీన్మార్ ఆడొద్దు ప్లీజ్!
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ - రానా కాంబోలో బడా మల్టీస్టారర్ గా అయ్యప్పమ్ కోషియమ్ రీమేక్ మూవీ గ్రాండ్ గా  మొదలయ్యింది. ఆ పూజా కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ కూడా కాస్త సందడి చేసాడు. కానీ ఫాన్స్ లో మాత్రం కాస్త గందర గోళం నెలకొంది ఏమిటంటే.. ఈ సినిమాకి త్రివిక్రమే కథ, మాటలు అన్ని అందిస్తున్నారని.. ఆ మధ్యన అజ్ఞాతవాసి కొట్టిన దెబ్బకి ఇంకా ఆయిట్మెంట్ రాసుకుంటూ ఉన్న పవన్  ఫాన్స్ కి ఇది ఇప్పుడు కొత్త టెంక్షన్ లా తయారైంది. దానికి కారణం లేకపోలేదు. గతంలో హిందీ కల్ట్ క్లాసిక్.. లవ్ ఆజ్కల్ తీసుకొచ్చి త్రివిక్రమ్ చేతిలో పెడితే.. ఆ సినిమాకి త్రివిక్రమ్ తనదైన శైలిలో కథ, మాటలు రాసాడు.

త్రివిక్రమ్ కథ అనగానే దానిని యధాతధంగా తెరకెక్కించక తప్పలేదు తీన్మార్ డైరెక్టర్ జయంత్ సి పరాన్జికి. ఆ తీన్మార్ రిజెల్ట్ ఎలా వచ్చిందో అనేది మనందరం చూసిందే. ఇప్పుడు కూడా అయ్యప్పమ్ కోషియమ్ మలయాళం హిట్ సినిమాకి త్రివిక్రమ్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారనగానే తీన్మార్ డేస్ గుర్తొస్తున్నాయి పవన్ ఫాన్స్ కి. అందుకనే సోషల్ మీడియాలో పవన్ ఫాన్స్ డిస్కర్షన్స్ లో ఈ తరహా చర్చలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ సర్ తీన్మార్ ఆడించొద్దు ప్లీజ్ తట్టుకోలేం అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. మే బీ ఈ సినిమాతో ఆ మచ్చని తుడిచేసుకుంటాడేమో త్రివిక్రమ్ వేచి చూడాలి. 

Fear in Mega Fans with Pawan and Trivikram sentiment:

Trivikram Srinivas Dialogues to Pawan Kalyan Ayyappanum Koshiyum Remake

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ