మెగాస్టార్ చిరంజీవిని కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు కలుసుకున్నారు. ఆ ఇద్దరూ చిరకాల మిత్రులనే విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి 'ఆచార్య' సినిమా చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఆ సినిమా షూటింగ్ జరుగుతోంది.
బుధవారం మోహన్‌బాబు 'ఆచార్య' సెట్స్ దగ్గరకు వెళ్లి, చిరంజీవికి బొకే ఇచ్చి, స్నేహపూర్వకంగా కలిశారు. చిరకాల మిత్రుడు తన సినిమా సెట్స్‌కు రావడంతో చిరంజీవి ఆనందంతో మోహన్‌బాబును ఆహ్వానించారు. ఆ ఇద్దరూ కొద్దిసేపు సినిమాలతో పాటు వివిధ అంశాలపై మాట్లాడుకున్నారు.
ఇక్కడ మరో విశేషం ఏమిటంటే మెగాస్టార్ చిరు ని కలవడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది అది ఏమిటి అంటే.. అది త్వరలోనే చెబుతామంటూ మంచు విష్ణు ట్వీట్ చెయ్యడం విశేషం. నిన్న ఇదే టైం కి మంచు విష్ణు మెగా స్టార్ తో దిగిన ఓ ఫోటో ని ట్విట్టర్ షేర్ చేసాడు. నిన్న మంచు వారబ్బాయి వెళితే ఇప్పుడు నేరుగా మోహన్ బాబు చిరు ని కలవడానికి వెళ్లడం చూస్తే తండ్రి కొడుకులు చిరుని కలవడం వెనుక బలమైన కారణం ఉందనిపిస్తుంది. మరి చిరు ని ఏదైనా ఈవెంట్ కి ఆహ్వానిస్తున్నారా లేదంటే.. ఏదైనా మ్యాజిక్ చేయబోతున్నారా అనేది మంచు వారబ్బాయి చెప్పినట్లు కొంచెం వెయిట్ చేసి చూద్దాం.