Advertisementt

వకీల్ సాబ్ ఏ టాపిక్ వదలట్లేదు

Mon 28th Dec 2020 10:00 PM
vakeel saab,pawan kalyan,lawyer look  వకీల్ సాబ్ ఏ టాపిక్ వదలట్లేదు
Vakeel Saab did not leave any topic వకీల్ సాబ్ ఏ టాపిక్ వదలట్లేదు
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ - వేణు శ్రీరామ్ కాంబోలో తెరకెక్కుతున్న పింక్ రీమేక్ వకీల్ సాబ్ చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ కాస్త రాజకీయాలకు బ్రేక్ ఇచ్చి సినిమా షూటింగ్స్ లో కంటిన్యుగా పాల్గొంటున్నాడు. ప్రస్తుతం వకీల్ సాబ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ చిత్రీకరణ జరుగుతుంది. ఇప్పటికే వకీల్ సాబ్ సెట్స్ నుండి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కి సంబందించిన పవన్ - శృతి హాసన్ ల పిక్ లీకై వైరల్ అయ్యింది. అయితే వకీల్ సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో రైతు పోరాట ఉద్యమాల దృశ్యాల చిత్రకరణ ఈ రోజు షూట్ చెయ్యడం ఆ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో లీక్ అవడం ఆ టాపిక్ మీడియాలో వైరల్ అవడం కూడా జరిగింది. 

ఒక వైపు ఢిల్లీ లో రైతుల ధర్నా.. బిజెపి ఎగ్గైనెస్ట్ గా ఇలా ఉన్న టైం లో బిజెపి తో పొత్తులో ఉన్న టైం లో పవన్ కళ్యాణ్ రైతులకి సపోర్టింగ్ గా  సినిమాలో మరి ఏం మాట్లాడతాడు. ఎలా చెయ్యబోతున్నాడు. ఇది ఒక్కటే కాదు. ఇంకా చాలా టాపిక్స్ వకీల్ సాబ్ లో ఇన్వాల్వ్ చేసాడని.. పవన్ కళ్యాణ్ సూచనల మేరకు దర్శకుడు వేణు శ్రీరామ్ చాలా టాపిక్స్ ఒరిజినల్ లో లేనివి వకీల్ సాబ్ లో యాడ్ చేసారని తెలుస్తుంది. ఏ టాపిక్ ని వదలకుండా చాలా వరకు చాలా చాలా బర్ణింగ్ ఇష్యుస్ ని కవర్ చేసారని తెలుస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి నల్ల కోటు వేసుకుని లాయర్ కేరెక్టర్ చేయడమనేది అతని డ్రీం. తన డ్రీం రోల్ ఫస్ట్ టైం చేస్తున్నాడేమో.. చాలా టాపిక్స్ పట్ల తన స్పందన తెలపాలి అనుకుంటున్నాడు కనక అవన్నీ వకీల్ సాబ్ లో ఇరికించేస్తున్నారట. ఏ టాపిక్ ని వదలని వకీల్ సాబ్ బాక్సాఫీసు సక్సెస్ ని కూడా వదలకుండా పట్టుకోగలిగితే ఫాన్స్ అంతకు మించి కావాల్సింది ఏముంది.

Vakeel Saab did not leave any topic:

Vakeel Saab Shooting Clipping Leaked 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ