Advertisementt

హారిక విషయంలో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన అభిజిత్!

Tue 22nd Dec 2020 05:37 PM
abhijith,bigg boss,harika  హారిక విషయంలో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన అభిజిత్!
Abhijit gives a big twist to Harika! హారిక విషయంలో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన అభిజిత్!
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడూ ఒంటరిగా ఉండే అభిజిత్ కి టాస్క్ ల విషయంలో కూడా చాలా డల్ గానే ఉండేవాడు. తనకున్న హెల్త్ ప్రాబ్లెమ్ కారణమో ఏమో కానీ.. తెలివిగా బుర్ర పెట్టి టాస్క్ ఆడేందుకు ప్రయత్నించేవాడు. ఇక హౌస్ లో మోనాల్ తో సెట్ అవదనుకున్న అభిజిత్.. హారిక తో క్లోజ్ గా ఉంటూ హారిక తో ముచ్చట్లు పెట్టేవాడు. హారికకి ఏ బాధ ఉన్నా అభిజిత్ ఓదార్చడంతో వారి రిలేషన్ పై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు మొదలయ్యాయి. అందులోనుగా ఆభిజీత్ ని హరిక మదర్ పొగడడంతో అభిజిత్ కి హరికకి సం థింగ్ సం థింగ్ అంటూ రకరకాల న్యూస్ లు ప్రచారంలోకొచ్చాయి.

అయితే నాగ్ హారికాని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి అభిజిత్ విషయంలో క్లాస్ పీకే వరకు హరిక - అభిజిత్ జంటగానే కనబడేవారు. ఆతర్వాత హారికాని అభిజిత్ నామినేట్ చెయ్యడం, అభిజిత్ ని హరిక నామినేట్ చెయ్యడంతో వారి మధ్యన విభేదాలు మొదలయ్యాయి. అప్పటినుండి హరిక - అభిలు కాస్త ఏడ మొహం పెడమొహంగానే ఉంటున్నారు. తాజాగా బిగ్ బాస్ విన్నర్ అయ్యాక అభిజిత్ కి హగ్ ఇచ్చి సైలెంట్ గా హారిక వెళ్ళిపోయింది. వెళ్తూ వెళ్తూ అఖిల్ - సోహైల్ లని థాంక్స్ బ్రదర్స్ అనడంతో సోహైల్ షాకయ్యాడు. ఇక అభిజిత్ అయితే సోషల్ మీడియాలో వచ్చిన పుకార్లకు ఒకే ఒక్క మాటతో చెక్ పెట్టాడు. అదే హారిక తనకి చెల్లెలు లాంటిది అంటూ ఓ ఛానల్ లైవ్ లో మాట్లాడి అందరికి షాక్ కాదు వాళ్ళ రిలేషన్ పై బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు.

Abhijit gives a big twist to Harika!:

Abhijith says harika is like a sister to him

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ