చిరంజీవి ఎంత రొమాంటింక్, ఎంత స్మార్ట్, ఎంతగా కామెడీ చేస్తాడో కొత్తగా చెప్పాల్సింది, మాట్లాడుకోవాల్సింది ఏం లేదు. అంత టాలెంట్ ఉంది కాబట్టే ఆయన మెగాస్టార్ అయ్యాడు. చిరు కు వయసైపోతున్నా ఆయనలో రొమాంటిక్ యాంగిల్ ఏం తగ్గలేదు. నిన్నటికి నిన్న బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే స్టేజ్ మీద హీరోయిన్ దివి, హరికలతో చిరు రొమాంటిక్ గా మాట్లాడి అందరిని పడేసారు. ఈ వయసులోనూ చిరు చాలా స్మార్ట్ గా బరువు తగ్గి ఆయన కొడుకు రామ్ చరణ్ కే పోటీ ఇచ్చేస్తున్నాడు. అలాగే అమ్మాయిలని చూడగానే రొమాంటిక్ గా మెలికలు తిరగడం చూసిన వారు.. మీరు చాలా రొమాంటిక్ బోస్ అంటున్నారు.
తాజాగా సామ్ జామ్ ప్రోమో లోను చిరు సిగ్గుపడడం చూస్తే అబ్బా ఈ వయసులోనూ బాస్ గ్రెస్ తగ్గలేదు అంటారు. సమంత అడిగే చిలిపి ప్రశ్నలకు చిరు సిగ్గుపడుతూ ఇచ్చే సమాధానాల ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మీ ఫ్రిజ్ లో ఎల్లప్పుడు ఉండే వస్తువు అని సామ్ అడగగానే మీరన్నది కాదు అన్న చిరు.. మీరు సినిమా చూస్తూ ఎపుడైనా ఏడ్చేసారా అని సామ్ అనగానే.. ఓ సినిమా చూసినప్పుడు నా కళ్ళలో నీళ్లు కారిపోతున్నాయి.. పక్కనే ఉన్న చీర చెంగు తీసుకుని తుడుచుకుంటున్న సమయంలో లైట్స్ వేశారు అంటూ చిరు అనేసరికి సమంత కూడా ఫన్నీగా మీరు చాలా రొమాంటిక్ అనుకున్నారేమో అనగానే చిరు పడిన సిగ్గు అంతా ఇంతా కాదు. మరి చిరులో కామెడీ యాంగిల్ కానీ, రొమాంటిక్ యాంగిల్ కానీ ఏమాత్రం తగ్గలేదని చెప్పడానికి ఇవే ఉదాహరణలు. అదే సామ్ జామ్ ప్రోమోలో కళ్ళకు గంతలు కట్టుకుని చిరు దోశ తిరగెయ్యడం హైలెట్ అనేలా ఉంది.