నేను శైలజ తో బాబ్లీ గర్ల్ గ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మహానటి కీర్తి సురేష్.. చక్కటి అందంతో ఆకర్షణగా ఉండేది. మహానటి సినిమా కోసం కాస్త బరువు పెరిగిన కీర్తి సురేష్ కి మహానటి అయితే భారీ హిట్ ఇచ్చింది కానీ.. ఆ సినిమా వలన కీర్తి సురేష్ చాలా కోల్పోవలసి వచ్చింది. అంటే బరువు వలన సినిమా అవకాశాలు కోల్పోయింది. మహానటి తర్వాత స్టార్ హీరోల సినిమాలు క్యూ కడతాయనుకుంటే.. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ కి పరిమితం కావాల్సి వచ్చింది. ఇక ఈ ఏడాది థియేటర్స్ బంద్ అయినా ఓటిటి లలో కీర్తి సురేష్ సినిమాలు వరసగా విడుదలైయ్యాయి. పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలు ఓటిటిలోనే విడుదలై ప్లాప్ ని మూటగట్టుకున్నాయి. అటు సినిమాల విషయంలోనూ కీర్తి హ్యాపీగా కాలేదు. మరోపక్క బరువు మీద వచ్చిన విమర్శలను పోగొట్టుకోవడానికి వర్కవుట్స్ అంటే 150 సూర్య నమస్కారాలు, 200 యోగాసనాలు అంటూ బాగా బరువు తగ్గిపోయింది.. విమర్శకుల నోళ్లు మూయించింది.
కానీ ఏం లాభం కీర్తి సురేష్ పేస్ లో గ్లో మొత్తం మిస్ అయ్యింది. నేను శైలజతో ముద్దుగా బొద్దుగా ఉన్న నకీర్తి సురేష్.. ఇప్పుడు ఫేస్ లో కళ లేకుండా కనబడుతుంది. గతంలో సోషల్ మీడియాకి దూరంగా ఉన్న కీర్తి సురేష్ ఈ మధ్య తరుచూ తన ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. బరువు తగ్గాను.. నన్ను గమనించండి అంటూ వరస ఫోటో షూట్స్ తో హడావిడి చేస్తుంది. కానీ కీర్తి సురేష్ వరస ఫోటో షూట్స్ లో, ఆమె బరువు తగ్గినా ఫొటోస్ బావున్నా.. ఆ ఫేస్ లో కళాకాంతుల కోసం కొవ్వొత్తి పెట్టి వెతికేస్తున్నారు అభిమానులు. తాజాగా కీర్తి సురేష్ కజిన్ మ్యారేజ్ లో కీర్తి సారీ లుక్స్, అలాగే పెళ్ళికి మెహిందీ వేడుకలకు హాజరైన ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చెయ్యగానే.. అందులో కీర్తి క్లోజ్ అప్ ఫేస్ చూసి.. అమ్మా కీర్తి నువ్వు బరువు పెరిగి అందంగా తయారయ్యే వరకు ఫోటో షూట్స్ చేయించుకోకు.. చేయించుకున్నా వాటిని సోషల్ మీడియాలో షేర్ చెయ్యకు అంటూ అభిమానులు రిక్వెస్ట్ చేస్తున్నారు.