కరోనా వచ్చింది కాలం కరిగిపోయింది. వేసవి లేదు, దసరా లేదు, పండగ లేదు, పబ్బం లేదు. మొత్తం సెలవలన్నీ కరోనాకి కి బలైపోయాయి. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన అలా వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరూ తప్ప బాక్సాఫీసుని కదిలించిన సినిమాలే లేవు. చివరికి క్రేజ్ అనుకున్న నాని వి, అనుష్క నిశ్శబ్దం సినిమాలు ఓటిటి అంటూ ఆవేశపడినా వర్కౌట్ అవ్వలేదు. థియేటర్స్ బంద్ తో ప్రేక్షకులే కాదు.. సినిమా ఇండస్ట్రీ మొత్తం నిరాశలో మునిగిపోయింది. తాజాగా థియేటర్స్ ఓపెన్ చేసారు.. మెల్లగా హీరోలు తమ సినిమాలతో థియేటర్స్ లో హడవిడి చెయ్యడానికి రెడీ అయ్యారు. అందులో ముందుగా రేపు శుక్రవారం క్రిస్మస్ రోజున సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సోయి బెటర్ అంటుంటే.. మేము సంక్రాంతికి ఫిక్స్ అవుతున్నాం అంటూ రవితేజ క్రాక్, రామ్ రెడ్, రానా అరణ్య సినిమాలతో 2021 సంక్రాంతికి కి రెడీ అయ్యారు.
ఈ సంక్రాతి రేసులో పవన్ వకీల్ సాబ్, చైతు లవ్ స్టోరీ, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లాంటివి ఉంటాయనుకుంటే.. ప్రస్తుతం రవితేజ - గోపీచంద్ క్రాక్, రామ్ రెడ్, రానా అరణ్య సినిమాలు లైన్ లోకొచ్చాయి. మరోపక్క తమిళం నుండి విజయ్ మాస్టర్ ఈ పొంగల్ కే రంగంలోకి దిగబోతుంది. మంచి క్రేజ్ ఉన్న మాస్టర్ సంక్రాతి బరిలో అంటే తెలుగు హీరోలకు టెంక్షన్ ఉంటుంది. ఏడెనిమిది సినిమాలో సంక్రాతి బరిలో ఉంటాయనుకుంటే ప్రస్తుతానికి క్రాక్, అరణ్య.. రెండు మూడు రోజుల్లో రామ్ కూడా రెడ్ ని సంక్రాంతికి ఫిక్స్ చేసి డేట్ లాక్ చేస్తే.. ఈ మూడు తెలుగు సినిమాలు సంక్రాతి బరిలో కొట్లాటకు దిగుతాయి. రామ్ ఎంతో పట్టుదలగా రెడ్ ని థియేటర్స్ లోనే విడుదల చెయ్యాలని చూస్తున్నాడు. దానితో సినిమాపై క్రేజ్ పెరిగింది.
అయితే స్టార్ హీరోలెవరూ ఈ సంక్రాంతికి దిగే సాహసం చెయ్యడం లేదు. 50 శాతం అక్యుపెన్సీతో స్టార్ హీరోలకి వర్కౌట్ అవధని వారు సైలెంట్ గా ఉండిపోతున్నారు. అయితే ప్రతి సంక్రాంతికి పందెం పుంజుల్లా తలపడే స్టార్ హీరోలు ఈ సంక్రాంతిని స్కిప్ చేస్తున్నారు. దానితో ఎప్పుడు స్టార్ హీరోల సినెమాలకు అలవాటు అపడిపోయిం ఫ్యామిలీ ఆడియన్స్ ఈయశ్రీ మీడియం రేంజ్ హీరోల సినిమాలను ఓ చూపు చూద్దాం అంటున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ సంక్రాతికి వచ్చే భారీ బడ్జెట్ సినిమాలను కుటుంబ సమేతంగా వీక్షించి ఎంజాయ్ చేస్తుంటారు. అలాంటి వారికి క్రాక్, రెడ్, అరణ్య సినిమాలు ఈసారి కొత్తగా కనిపిస్తున్నాయి. అందుకే ఈ సంక్రాంతి ఫైట్ పై కొత్త ఇంట్రెస్ట్ అంటున్నారు.