బిగ్ బాస్ సీజన్ 4 లో మొదటి నుండి నామినేషన్స్ లోకి వచ్చిన అభిజిత్ ప్రతి వారం సేఫ్ అవుతూనే చివరికి టైటిల్ పట్టుకుపోయాడు. కానీ హౌస్ లో మోనాల్ ని తనవైపు తిప్పుకుని.. మోనాల్ అని అడ్డం పెట్టుకుని గేమ్ ఆడిన అఖిల్ చివరికి బకరాగా మిగిలిపోయాడు. అభిజిత్ తో గొడవ, మోనాల్ తో లవ్ ట్రాక్ అన్ని అఖిల్ ని విన్నర్ ని చేస్తాయనుకున్నాడు అఖిల్.. అందుకే అఖిలే నెంబర్ వన్ అంటూ ఫీలయ్యాడు. మోనాల్ తో ఉంటే ఫుటేజ్ వస్తుందని భావించిన అఖిల్ ఎప్పుడూ ఆమె చుట్టూనే తిరుగుతూ హగ్స్ ఇస్తూ.. ముద్దులు పెట్టుకుంటూ బిగ్ బాస్ గేమ్ ఆడాడు. అఖిల్ అనుకున్న ఫుటేజ్ వచ్చింది. కానీ ఏం లాభం విన్నర్ మాత్రం అభిజిత్ అయ్యాడు.
చివరికి గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో అందరూ అంటే మెహబూబ్ సహా అందరూ హైలెట్ అయ్యారు ఒక్క అఖిల్ తప్ప. టాప్ 2 వరకు వెళ్లి చివరికి బకరా అయ్యాడు అఖిల్. గ్రాండ్ ఫినాలే స్టేజ్ మీది చిరు - సోహైల్ సంభాషణ మెయిన్ హైలెట్ గా నిలిస్తే అభిజిత్ ట్రోఫీ గెలవడం మరో హైలెట్ అయ్యింది. అలాగే మెహబూబ్ కి చిరు 10 లక్షల చెక్ ఇవ్వడం ఇంకాస్త హైలెట్ కాగా.. దివి, హరికల తో చిరు రొమాంటిక్ సంభాషణ మరింతగా హైలెట్ అయ్యింది. కానీ చిరు అఖిల్ గురించి చాలా తక్కువ మాట్లాడడం ఒక బాధ అయితే.. గేమ్ లో పట్టు లేని అభిజిత్ ట్రోఫీ కొట్టెయ్యడం అఖిల్ కి మరో బాధాకర విషయం. మరోపక్క సోహైల్ 25 లక్షలు పట్టుకుపోగా.. ఆభిజీత్ విన్నర్ గా మరో 25 లక్షలు పట్టుకుపోయాడు. నాగ్ అభిజిత్ ని విన్నర్ గా ఎనౌన్స్ చెయ్యగానే అఖిల్ ఫేస్ మాడిపోయింది.
మరోపక్క ఈ ఎపిసోడ్ లో సోహైల్, మెహబూబ్ లు చిరుతో మాట్లాడిన మాటలకు అందరూ ఫిదా అయ్యారు. కానీ అఖిల్ మాత్రం సగటు ప్రేక్షకుడిగా నిలబడిపోయాడు. అయితే ఎలాంటి ఫేమ్ లేని అఖిల్ బిగ్ బాస్ టాప్ టు వరకు రావడం సామాన్యమైన విషయం కాదు.. అఖిల్ కెరీర్ కి ఇది ఉపయోగపడే ఛాన్స్ లేకపోలేదు. ఇక అఖిల్ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే లో ఎలా బకరా అయ్యాడో సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో తెగ వైరాలవుతున్నాయి.