Advertisementt

అబ్బ చిరు అరిపించాడుగా..!

Tue 22nd Dec 2020 02:41 PM
bigg boss,bigg boss grand finale,chiranjeevi,nagarjuna,highlights  అబ్బ చిరు అరిపించాడుగా..!
Bigg Boss Grand finale: Chiranjeevi speech main highlights అబ్బ చిరు అరిపించాడుగా..!
Advertisement
Ads by CJ

స్టార్ మా లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 4 నిన్నటి గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ తో ఎండ్ కార్డు పడింది. నాగార్జున వ్యాఖ్యాతగా మొదలైన బిగ్ బాస్ షో.. చిరంజీవి గెస్ట్ గా ఎండ్ అయ్యింది. గత సీజన్ ఫినాలే కి గెస్ట్ గా వచ్చిన చిరు ఆ బిగ్ బాస్ స్టేజ్ పై అదరగొట్టేసినట్లుగానే ఇప్పుడు ఈ సీజన్ 4 గ్రాండ్ ఫినాలే స్టేజ్ మీద మరోసారి చప్పట్లు కొట్టించుకున్నాడు. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే స్టేజ్ మీద నాగ్ తో కలిసి విన్నర్ ని ప్రకటించడానికి వచ్చిన చిరు బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్ కి తన సినిమాల్లో అవకాశాల జల్లు కురిపించాడు. చిరు అయితే హారిక - దివి లని చూసి మెలికలు తిరుగుతూ సిగ్గుపడడం ఈ ఫినాలే స్టేజ్ మీద హైలెట్ అనేలా ఉంది.

దివికి ఏకంగా తన వేదాళం సినిమాలో ఓ రోల్ ఇవ్వమని మెహర్ రమేష్ తో మాట్లాడినట్లుగా చెప్పడం.. ఓ ఏడెనిమిది నెలల తరవాత మనం కలిసి పనిచేస్తామని చెప్పడంతో దివి ఒక్కసారిగా షాకయ్యింది. అంతేకాకుండా మెహబూబ్ కి 10 లక్షల చెక్ ఇచ్చి అందరిని ఆశ్చర్యంలో పడేసాడు చిరు. ప్రతి కంటెస్టెంట్స్ తో పేరు పేరునా మాట్లాడి అందరిని సర్ప్రైజ్ చేసాడు. అవినాష్ కామెడీ నచ్చింది అని, సోహైల్ కథ వేరే ఉంటాది అనే డైలాగు బావుంది అని, మెగబూబ్ లో తనని తాను చూసుకున్నా అని, లాస్య నవ్వు చూస్తే మా ఇంట్లో అమ్మాయిలా అనిపించావని, హారిక తో తన పాత సినిమా సాంగ్ గుర్తొచ్చింది అంటూ నాగ్ చూడకుండా హరికకి రోజ్ ఫ్లవర్ చూపించడం.. అబ్బ చిరు బిగ్ బాస్ స్టేజ్ మీద అదరగొట్టేసాడనుకోండి.

చివరిగా నాగార్జున టాప్ 2 లో ఉన్న అభిజిత్ - అఖిల్ లలో విన్నర్ ని ప్రకటించడంతో.. సీజన్ 4 విన్నర్ గా నిలిచిన అభిజిత్ చిరు కి పాదాభివందనం చేసాడు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో ఆభిజీత్ కేరెక్టర్ చాలా సెటిల్డ్ గా ఉన్నట్టుగానే అభిజిత్ నిజ జీవితంలోను అన్ని ఎమోషన్స్ క్యారీ చేసే యువకుడిగా ఉన్నాడని మెచ్చుకున్నాడు. ఇక అఖిల్ పులిహోరని కామెడీ చేసి చూపించాడు చిరు. మోనాల్ నీకు సినిమా అవకాశాలు వస్తున్నాయని విన్నా అంటూ మోనాల్ ని సర్ప్రైజ్ చేసిన చిరు కామెడీ.. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకి మెయిన్ హైలెట్ గా నిలిచింది.

Bigg Boss Grand finale: Chiranjeevi speech main highlights:

Bigg Boss Grand finale main Highlights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ