Advertisementt

నిజంగా సాయి పల్లవి అద్భుతం!

Tue 22nd Dec 2020 12:42 PM
sai pallavi,paava kadhaigal web series,director vetrimaran  నిజంగా సాయి పల్లవి అద్భుతం!
Truly Sai Pallavi is awesome! నిజంగా సాయి పల్లవి అద్భుతం!
Advertisement
Ads by CJ

సాయి పల్లవి పెరఫార్మెన్సు కి ఫిదా కానీ ప్రేక్షకులు ఉండరు. స్టార్ హీరోల అవకాశం వచ్చిన తనకున్న లిమిట్స్ వలన చాలా అవకాశాలను వదులుకున్న నటి. సినిమాలో తన కేరెక్టర్ నచ్చితేనే సినిమా ఒప్పుకుంటుంది అంటారు కానీ.. సాయి పల్లవి సినిమా ఒప్పుకుంది అంటే అందులో ప్రత్యేకత కన్నా ఆమె పాత్ర గురించిన క్యూరియాసిటీ అందరిలో కలుగుతుంది. తనకి వచ్చిన పాత్రలో సాయి పల్లవి సహజ నటనకు ఫుల్ మార్కులు పడిపోతాయి. అయితే లిప్ లాక్ కిస్సులకి, గ్లామర్ షోకి వ్యతిరేఖం అని చెప్పే సాయి పల్లవికి ఏడుపు సన్నివేశాల్లో నటించడం చాలా ఇష్టమట. ఎమోషనల్ పాత్రల్లో నటించాడన్ని ఎంజాయ్ చేస్తా అంటుంది. అయితే సాయి పల్లవి అలాంటి ఏడుపు సన్నివేశాల్లో నటించడం ఆమె తల్లితండ్రులకి అస్సలు ఇష్టం లేదట.

మరి తెలుగులో లవ్ స్టోరీ, విరాట పర్వం సినిమాలు చేస్తున్న సాయి పల్లవి తమిళనాట వెట్రిమారన్ దర్శకత్వంలో పావ క‌దైగ‌ల్ వెబ్ సీరీస్ లో నటించింది. పరువు హత్యల నేపథ్యంలో తెరకెక్కిన ఈ పావ క‌దైగ‌ల్ వెబ్ సీరీస్ నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. అందులో సాయి పల్లవి ప్రేమ కోసం కన్నవాళ్ళని వదిలి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయి భర్తతో సంతోషంగా ఉన్న టైం లో.. కూతురు గర్భవతి అని తెలిసిన తండ్రి(ప్రకాష్ రాజ్) సాయి పల్లవికి సీమంతం చేస్తా అని నమ్మించి పరువు కోసం చంపెయ్యడం అనేది ఆ వెబ్ సీరీస్ కథాంశం. అందులో సాయి పల్లవి చాలా అద్భుతంగా నటించింది. తండ్రి చేతిలో చనిపోతున్నప్పుడు సాయి పల్లవి ఎక్సప్రెషన్స్, ఆమె నటన అన్ని అద్భుతమే. సినిమాల్లోనే కాదు.. వెబ్ సీరీస్ తోనూ సాయి పల్లవి తానేమిటో ప్రూవ్ చేసుకుంటుంది.

Truly Sai Pallavi is awesome!:

Sai Pallavi starred in the Paava Kadhaigal web series

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ