Advertisementt

బిగ్‌బాస్‌ సీజన్‌ 4 హైలైట్స్‌

Tue 22nd Dec 2020 11:29 AM
bigg boss 4,bigg boss 4 highlights,chiru,nagarjuna,abhijeeth,akhil  బిగ్‌బాస్‌ సీజన్‌ 4 హైలైట్స్‌
Bigg boss season 4 Highlights బిగ్‌బాస్‌ సీజన్‌ 4 హైలైట్స్‌
Advertisement
Ads by CJ

కరోనా టైం లో బిగ్ బాస్ సీజన్ 4 మొదలు పెట్టిన స్టార్ మా దానిని ఎలాంటి ఒడుదుడుకులు లేకుండా సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసింది. నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో గ్రాండ్ ఫినాలే ఆదివారం సెలబ్రిటీస్ సందడి మధ్య ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ఫినాలే ఎపిసోడ్ లో నాగ్ కామెడీ రచ్చ, చిరు వాక్చాతుర్యం చివరికి అభిజీత్ ‌- అఖిల్‌ల మధ్య ట్రోఫీ విషయంలో గట్టి పోటీ నెలకొనడంతో.. అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఆ ఉత్కంఠకు తెరదించుతూ అత్యధిక ఓట్లు సాధించి ప్రేక్షకాభిమానాన్ని చూరగొన్న అభిజీత్‌ను విజేతగా ప్రకటించారు. ఇక అభిజిత్ విన్నర్ గా సీజన్ 4 గ్రాండ్ సక్సెస్ ఫుల్ గా ముగిసింది. నాగ్ వ్యాఖ్యాతగా మొదలైన సీజన్ 4 హైలెట్స్ లో ముఖ్యమైనవి మీ కోసం..

* సెప్టెంబరు 6న మొదలైన ‘బిగ్‌బాస్‌ సీజన్‌-4’ 105 రోజుల పాటు నిర్విరామంగా సాగింది.

* కరోనా నేపథ్యంలో ఈసారి హౌస్‌లోకి వెళ్లేవారి కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి ఒక్కరినీ కరోనా టెస్టు చేసి, క్వారంటైన్‌ తర్వాతే హౌస్‌లోకి పంపారు.

* సూర్య కిరణ్‌, కల్యాణి, దేవి, స్వాతి, గంగవ్వ, సుజాత, దివి, నోయల్‌, అమ్మా రాజశేఖర్‌, మెహబూబ్‌, లాస్య, అవినాష్‌, మోనల్‌, హారిక, అరియానా, సోహైల్‌, అఖిల్‌, అభిజీత్‌ మొత్తం 19మంది కంటెస్టెంట్‌లు ఈ సీజన్‌లో పాల్గొన్నారు.

* వీరిలో కుమార్‌ సాయి, అవినాశ్‌, స్వాతి వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా లోపలికి వెళ్లారు.

* గంగవ్వ, నోయల్‌లు అనారోగ్యం కారణంగా సీజన్‌ మధ్యలోనే హౌస్‌ విడిచి వెళ్లిపోయారు.

* నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ సందర్భంగా మనాలిలో ఉండడంతో.. దసరా పండుగ సందర్భంగా సమంత వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆ ఎపిసోడ్ బాగా వైరల్ కూడా అయ్యింది.

* 62వ రోజున తమిళ బిగ్‌బాస్ హౌస్‌ మేట్స్‌తో పాటు, వ్యాఖ్యాత కమల్‌ హాసన్‌‌ తెలుగు బిగ్‌బాస్‌ షోలోని వారితో వర్చువల్‌గా మాట్లాడారు.

* 100వ రోజు స్పెషల్‌గా హరితేజ (సీజన్‌-1), గీతా మాధురి (సీజన్‌-2), శ్రీముఖి (సీజన్‌-3) అలీ రెజా (సీజన్‌-3)లో పాల్గొన్న వారితో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు.

* 105 వ రోజు బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ని నాగార్జున.. చిరు తో కలిసి సక్సెస్ ఫుల్ గా ముగించడం.. అదే స్టేజ్ మీద బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ గా అభిజిత్ ని ఎంపిక చేసి.. అభిజీత్‌కు ట్రోఫీతో పాటు 50 లక్షల నగదు బహుమతిని అందించారు.

Bigg boss season 4 Highlights:

Bigg Boss season 4 Highlights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ