Advertisementt

ఆమె కోరికను ఎవరైనా తీర్చండి బాబు!

Mon 21st Dec 2020 03:10 PM
raashi khanna,raashi khanna saree look,traditional look,elegant vintage look  ఆమె కోరికను ఎవరైనా తీర్చండి బాబు!
Someone please launch to fulfill her wish! ఆమె కోరికను ఎవరైనా తీర్చండి బాబు!
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో నటించినా రాశి ఖన్నా లక్కు మారలేదు.. స్టార్ హీరోల ఛాన్స్ లు రాలేదు. మీడియం రేంజ్ హీరోలతో నెట్టుకొస్తున్న రాశి ఖన్నాకి గత కొంతకాలంగా అవకాశాలు సన్నగిల్లాయి. విజయ్ దేవరకొండ వరల్డ్ ఫెమస్ లవర్ లో బోల్డ్ గా నటించన రాశి ఖన్నా ప్రస్తుతం డీ గ్లామర్ అండ్ ట్రెడిషనల్ పాత్రల మీద మనసు పారేసుకుంది. ఎప్పుడూ గ్లామర్ పాత్రాలేనా అప్పుడప్పుడు ఇలాంటి డి గ్లామర్ పాత్రలు చెయ్యాలని రీసెంట్ గా రకుల్ ప్రీత్ చెప్పినట్టుగా రాశి ఖన్నా మనసు ట్రెడిషనల్ పాత్రలంటే పదహారణాల తెలుగమ్మాయి పాత్రలు చెయ్యాలని ఉంది అంటూ కోరికను బయటపెట్టింది రాశి ఖన్నా. ఈమధ్యనే దుల్కర్ సినిమాలో రాశి ఖన్నాకి సెకండ్ హీరోయిన్ ఛాన్స్ కూడా వచ్చింది అనే టాక్ ఉంది.

ప్రస్తుతం రాశి ఖన్నా పదహారణాల తెలుగమ్మాయి పాత్ర కోసం డ్రెస్సింగ్ స్టయిల్ మార్చేసింది. అలాగే బాగా బరువు తగ్గి లంగా ఓణీ, చీర కట్టులో కవ్విస్తున్న రాశి ఖన్నా కి ట్రెడిషనల్ అవకాశాలు రాసి పెట్టుకోమంటుంది. రాశి ఖన్నా రీసెంట్ ఫోటో షూట్స్ చూసిన వారు ఆమె కోరిక ఎవరైనా తీర్చండి బాబు అనేస్తారు. అంత చక్కగా రెడీ అవుతున్న రాశి ఖన్నా మీద తెలుగు డైరెక్టర్స్ చూపు ఎపుడు పడుతుందో మరి. ఎప్పుడూ గ్లామర్ షో చేసే రాశి ఖన్నా ప్రస్తుతం ఈ పదహారణాల తెలుగమ్మాయి ఫోటో షూట్స్ మాత్రం ఫాన్స్ కి కిక్కిస్తున్నాయి.

Someone please launch to fulfill her wish!:

Raashi Khanna elegant Vintage look

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ