Advertisementt

బ్రేకిచ్చిన బిగ్ బాస్.. బోర్ అంటున్న ప్రేక్షకులు!

Mon 21st Dec 2020 11:58 AM
bigg boss,bigg boss telugu,grand finale,nagarjuna  బ్రేకిచ్చిన బిగ్ బాస్.. బోర్ అంటున్న ప్రేక్షకులు!
Break in Bigg Boss.. it turns boring బ్రేకిచ్చిన బిగ్ బాస్.. బోర్ అంటున్న ప్రేక్షకులు!
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే స్టార్ మా లో స్టార్ట్ అయ్యింది.. సాయంత్రం 6 గంటల నుండే గ్రాండ్ ఫినాలే స్టేజ్ నాగార్జున వ్యాఖ్యాతగా ఓల్డ్ కంటెస్టెంట్స్ తో కళకళలాడింది. ఎలిమినేట్ అయిన 13 మంది కంటెస్టెంట్స్ తాము ఎలిమినేట్ అయ్యాక ఎంతగా ఫెమాస్ అయ్యామో నాగార్జునకి ఒక్కొక్కరిగా వివరించారు. నాగ్ కూడా ఓపిగ్గా వింటూ బిగ్ బాస్ ని ప్రమోట్ చెసాడు. ఇంకా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్స్ తో ఓ డాన్స్ పెరఫార్మెన్స్ ఇప్పించి.. బయట ఉన్న వారి పేరెంట్స్ తో మాట్లాడించారు. ఒక్కొక్కరిగా తమ పేరెంట్స్ తో మాట్లాడిన కంటెస్టెంట్స్ ఎవరిని విన్నర్ ని చేస్తారో అనే క్యూరియాసిటీ తో కూడిన టెంక్షన్ తో ఉన్నారు. ఇక నాగార్జున తో 13 మంది హౌస్ మేట్స్ కామెడీ చెయ్యగా.. 

సోహైల్ తండ్రి తో మాట్లాడుతున్నప్పుడు నాగ్ ఏంటి సోహైల్ ఖార్కానా అంటున్నావ్ అని ఫన్ తో కూడిన కామెడీ చెయ్యగా సోహైల్ తడబాటుతో మా డాడ్ ఇక్కడే ఉన్నారు సర్ అనగానే నాగ్ అవునవును మీ డాడ్ ముందుమాట్లడొద్దు అంటూ పరువు తీసేసాడు. మరి సాయంత్రం 6 గంటల  నుండి రాత్రి 10  గంటల వరకు డిజైన్ చేసిన ఈ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో ఇప్పటివరకు హౌస్ మేట్స్  జర్నీ అవీ ఇవీ చూపించి బోర్ కొట్టించారు. ఇంతవరకు ఒక్క ఇంట్రెస్ట్ అన్న పెరఫార్మెన్స్ కూడా లేదు. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ కి నాగ్ బ్రేకిచ్చాడు.. హమ్మయ్య బ్రేకొచ్చింది.. బోర్ కొడుతోంది అంటున్నారు ప్రేక్షకులు. మరి నెక్స్ట్ జరగబోయే బిగ్ బాస్ ఫినాలే లో అనిల్ రావిపూడి, మెహ్రీన్ కౌర్ లు హౌస్ లోకి వెళ్లి కామెడీ రచ్చ చేస్తున్నారు. మెహ్రీన్ కౌర్ స్టేజ్ పెరఫార్మెన్స్, అలాగే ప్రణీత, లక్ష్మి రాయ్ ల పెరఫార్మెన్స్ అయినా కిక్ ఇస్తాయో చప్పగా ఉంటాయో చూడాలి. 

Break in Bigg Boss.. it turns boring:

Bigg Boss Grand finale Episode Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ