Advertisementt

బిగ్ బాస్ ఫినాలేని పట్టించుకోవడం లేదు!

Sun 20th Dec 2020 05:26 PM
bigg boss 4,bigg boss grand finale,devi nagavalli,tv9 anchor devi  బిగ్ బాస్ ఫినాలేని పట్టించుకోవడం లేదు!
Devi Nagavalli Skipped Bigg boss grand finale బిగ్ బాస్ ఫినాలేని పట్టించుకోవడం లేదు!
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే మరోకొద్దిసేపట్లో స్టార్ మా లో గ్రాండ్ గా ప్రసారం కాబోతుంది. గ్రాండ్ ఫినాలే కోసం చాలామంది సెలబ్రిటీస్ బిగ్ బాస్ స్టేజ్ మీద సందడి చేస్తున్నారు. నాగార్జున హోస్టింగ్ స్పెషల్ తో పాటుగా మెహ్రీన్, లక్ష్మి రాయ్, ప్రణీత డాన్స్ పెరఫార్మెన్స్, అంతేకాకుండా అనిల్ రావిపూడి కామెడీ రచ్చ అన్నీ స్పెషల్ గా ఉండబోతున్నాయి. అలాగే బిగ్ బాస్ ని వదిలిన మాజీ కంటెస్టెంట్స్ అందరూ బిగ్ బాస్ స్టేజ్ మీద స్పెషల్ పెరఫార్మెన్స్ తో అదరగొట్టేస్తున్నారు. మొదటి వారం ఎలిమినేట్ అయిన సూర్య కిరణ్ దగ్గరనుండి.. చివరి వారం ఎలిమినేట్ అయిన మోనాల్ వరకు గ్రాండ్ ఫినాలే సెట్స్ లో వాలిపోయారు. బిగ్ బాస్ హౌస్ లో మళ్ళీ అడుగుపెట్టను అన్న నోయెల్ కూడా హౌస్ లోకి వచ్చి రీ యూనియర్ పార్టీలో పాల్గొన్నాడు.

హౌస్ లో రీ యూనియన్ పార్టీకి రాని అమ్మ రాజశేఖర్, సూర్య కిరణ్ లు కూడా గ్రాండ్ ఫినాలే స్టేజ్ మీద కనిపిస్తుంటే.. మూడో వారం ఎలిమినేట్ అయిన స్ట్రాంగ్ కంటెస్టెంట్ దేవి నాగవల్లి మాత్రం కనిపించలేదు. అసలు దేవి నాగవల్లి బిగ్ బాస్ కి రావడమే ఆశ్చర్యకర విషయం అంటే.. అంత స్ట్రాంగ్ అయిన దేవి మూడో వారమే బయటికెళ్లిపోవడం మరో షాకింగ్ విషయం. హౌస్ నుండి స్ట్రాంగ్ అయిన నన్ను పంపిస్తున్నారని నవ్వుతూ వెల్లిన దేవి నాగవల్లి బయటికెళ్ళాక తాను ఎందుకు ఎలిమినేట్ అయ్యానో అర్ధం కాలేదని.. అంతలా తాను ఫెమస్ అయ్యా అంటూ కాస్త ఫీలయ్యింది. మరి అందుకే ఇప్పుడు దేవి బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కోసం రాలేదనిపిస్తుంది. బిగ్ బాస్ అయితే నాకేంటి అన్నట్టుగా దేవి గ్రాండ్ ఫినాలేకి హ్యాండ్ ఇచ్చింది.

Devi Nagavalli Skipped Bigg boss grand finale:

Devi nagavalli missing in Bigg boss grand finale stage

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ