Advertisementt

రామ్ ఏంటి కథ..!

Sun 20th Dec 2020 01:46 PM
ram,dinner party,anil ravipudi,venky kudumula,santosh srinivas,gopichand malineni  రామ్ ఏంటి కథ..!
Hero Ram met with sensational directors రామ్ ఏంటి కథ..!
Advertisement
Ads by CJ

రామ్ పోతినేని రెడ్ మూవీ విడుదల కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ తో మంచి ఊపుమీదున్న రామ్ రెడ్ సినిమాని మార్చి లోనే విడుదల చెయ్యాల్సింది. కానీ థియేటర్స్ బంద్ కారణంగా ఇంకా డేట్ ఇవ్వకుండా సంక్రాతి అంటూ ఊరిస్తున్న రామ్ ఏదో అప్ డేట్ అంటూ ట్వీట్ చెయ్యడంతో రెడ్ మూవీ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తాడేమో అనుకున్నారు. కానీ తాజాగా రామ్ హిట్ డైరెక్టర్స్ తో డిన్నర్ పార్టీ చేసుకున్నాడు. భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుములు దగ్గరనుండి అనిల్ రవిపుడి, గోపిచంద్ మలినేని, సంతోష్ శ్రీనివాస్‌, కిషోర్ తిరుమల కి రామ్ అదిరిపోయే డిన్నర్ పార్టీ ఇచ్చిఅంట్టుగా రామ్ షేర్ చేసిన పిక్ తో అర్ధమవుతుంది.

మరి రామ్ తో భీష్మ డైరెక్టర్, అనిల్ రావిపూడి పనిచేయలేదు.. అనిల్ రావిపూడి గతంలో రామ్ చిత్రాలకు స్క్రిప్ట్ వర్క్ చేసాడు. కానీ వెంకీ కుడుముసలతో రామ్ పని చెయ్యలేదు. ఇక గోపిచంద్ మలినేని తో పండగ చేస్కో, సంతోష్ శ్రీనివాస్ తో కందిరీగ, హైపర్ చిత్రాలు చేసాడు. ఇక కిషోర్ తిరుమలలో ఉన్నది ఒకటే జిందగీ,  నేను శైలజ సినిమాలు చేసిన రామ్ ప్రస్తుతం వారి కాంబోలో తెరకెక్కిన రెడ్ సినిమా విడుదల కావాల్సి ఉంది. మరి కరోనా కారణంగా అందరూ ఇంట్లోనే ఉంటున్న సమయంలో రామ్ ఇలా పార్టీ ఇవ్వడం వెనుక ఏం అర్ధముందో అంటూ నెటిజెన్స్ ఈకలు, పీకలు లాగుతున్నారు. రామ్ ఏంటి కథ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. డైరెక్టర్స్ తో రామ్.. ఫ్రెమ్ అదిరింది మరి.

Hero Ram met with sensational directors :

Ram Invites His sensational Directors For Dinner

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ