ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Contestants who could not make it to the top 3!

టాప్ 3 కి వెళ్లలేకపోయిన కంటెస్టెంట్స్!

Contestants who could not make it to the top 3!

బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలే ఈ రోజు ఆదివారం 6 గంటలకు స్టార్ మా లో గ్రాండ్ గా మొదలు కానుంది. నాగార్జున హోస్ట్ గా చిరంజీవి గెస్ట్ గా గ్రాండ్ ఫినాలేని ఓ రేంజ్ లో డిజైన్ చేసిందట స్టార్ మా యాజమాన్యం. చిరు గెస్ట్ గా సీజన్ 3 గ్రాండ్ ఫినాలే సూపర్ సక్సెస్ అవడంతో సీజన్ 4 కి గెస్ట్ గాను చిరునే పట్టుకొస్తున్నారు. అయితే ఈ సీజన్ 4  గ్రాండ్ ఫినాలే ని ఓ రేంజ్ లో ప్లాన్ చేసిన స్టార్ మా బిగ్ బాస్ ఫినాలే స్టేజ్ మీద హాట్ హీరోయిన్స్ పెరఫార్మెన్స్ ని ప్లాన్ చెయ్యడమే కాదు.. థమన్ మ్యూజిక్ కాన్సెర్ట్ కూడా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక ఫైనల్ విన్నర్ విషయంలో కాస్త సస్పెన్స్ ఉంటుంది అని అంటున్నారు. కాకపోతే ఈసారి కూడా అమ్మాయిలు విన్ అయ్యే ఛాన్స్ లేదని తేలిపోయింది.

ఇక బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే స్టేజ్ మీద ప్రణీత సుభాష్, మెహ్రీన్ కౌర్, లక్ష్మి రాయ్ ల డాన్స్ ప్రదర్శన ఆకట్టుకునేలా ప్లాన్ చేసారు.. ఈ హీరోయిన్స్ తమ గ్లామర్ స్టెప్స్ తో బిగ్ బాస్ స్టేజ్ ని షెకాడిస్తారని అంటుంటే.. థమన్ మ్యూజిక్ యూత్ ని ఉర్రుతలూగించడం ఖాయమంటున్నారు. మరోపక్క టాప్ 3 లో అఖిల్ - సోహైల్ - అభిజిత్ లు ఉన్నారని.. హారిక ముందు ఎలిమినేట్ అవ్వగా.. తర్వాత అరియనా ఎలిమినేట్ అయినట్లుగా సోషల్ మీడియా టాక్. సో హౌస్ లో ఉన్న ఆ ఇద్దరు అమ్మాయిలు టాప్ త్రీ లోకి వెళ్లలేకపోయినట్లుగా తెలుస్తుంది. మరి అఖిల్ - సోహైల్ - అభిజిత్ లలో ఎవరో ఒకరు ఈ సీజన్ 4  గ్రాండ్ టైటిల్ ని గెలుచుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. 

Bigg boss season 4 Grand Finale Highlights

bigg boss
bigg boss 4
bigg boss grand finale
nagarjuna
chiranjeevi
highlights