పూరి జగన్నాధ్ తో సినిమా ఒప్పుకున్న హీరోలంతా జిమ్ లో కష్టాలు పది సిక్స్ ప్యాక్ బాడీ తో సినిమాలోకి ఎంట్రీ ఇవ్వాల్సిందే. పూరి సినిమాలంటే అంతే. హీరోలకు మాములు కష్టాలు ఉండవు. దేశముదురు లో బన్నీ, టెంపర్ లో ఎన్టీఆర్, ఇజం లో కళ్యాణ్ రామ్, బుజ్జిగాడు లో ప్రభాస్ కూడా సిక్స్ ప్యాక్ బోడి ట్రై చేసినవారే.. అది పాత విషయమే. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా పూరి జగన్నాధ్ సినిమా అనగానే కండలు పెంచి జిమ్ లో కష్టపడుతూ సిక్స్ ప్యాక్ బాడీని తయారు చేసాడు. ఎందుకంటే పూరి సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపిస్తాడు కాబట్టి. ఆ సినిమా కోసం విజయ్ దేవరకొండ లుక్ పూర్తిగా మర్చాల్సి వచ్చింది.
ప్రెజెంట్ కరోనా తో సినిమా షూటింగ్ ఆగినా.. విజయ్ దేవరకొండ బాక్సర్ లుక్ తోనే ట్రావెల్ చెయ్యాల్సి వస్తుంది. ఎక్కడికెళ్ళానా ఒకే లుక్ మెయింటింగ్ చేస్తున్నాడు రౌడీ హీరో. డ్రెస్సులతో కొత్తదనం చూపిస్తున్నా విజయ్ దేవరకొండ లుక్ విషయంలో ఏం చేయలేకపోతున్నాడు. అలాగే జిమ్ లో ప్రతి రోజు వర్కౌట్స్ చెయ్యాల్సిందే. అయితే విజయ్ దేవరకొండ కష్టానికి పూరి జగన్నాధ్ బాక్సర్ క్లైమాక్స్ తో ఫలితం ఇవ్వబోతున్నాడట. ఎందుకంటే పూరి - విజయ్ కాంబోలో రాబోతున్న బాక్సర్ క్లైమాక్స్ ఎక్సట్రార్డినరీగా ఉండబోతుందనేది తాజా సమాచారం. ఒక్క క్లైమాక్స్ సినిమాకి మెయిన్ హైలెట్ గా నిలవబోతుందని అంటున్నారు. మరి రౌడీ హీరో ఫాన్స్ ప్యాన్ ఇండియా లెవల్లో సెలెబ్రేషన్స్ చేసుకోవడానికి రెడీ అవ్వాల్సిందే.