Advertisementt

అందరి చూపు అటువైపే..!

Sat 19th Dec 2020 06:10 PM
solo brathuke so better,sai tej,nabha natesh,theater release  అందరి చూపు అటువైపే..!
Everyone's eyes are on that ..! అందరి చూపు అటువైపే..!
Advertisement
Ads by CJ

లాక్ డౌన్ తర్వాత మళ్ళీ థియేటర్స్ ఓపెన్ అవడం, థియేటర్స్ లో సీట్స్ బుక్ అవడం, బాక్సాఫీసు కళకళలాడడం, క్రవుడ్ కనిపించడం లాంటి మూమెంట్ చూడాలని యావత్ సినిమా ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. దీనికి ఆరంభం ఈ డిసెంబర్ 25. ఇంతకుముందే కాస్త థియేటర్స్ ఓపెన్ అయినా ఏవేవో సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తున్నా.. తెలుగు సినిమా పరిశ్రమ నుండి చెప్పుకోదగ్గ ఒక స్టార్ హీరో సినిమా సోలో బ్రతుకే సో బెటరు సినిమా డిసెంబర్ 25 న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి.. కరోనా కి భయపడకుండా సినిమా చూసేందుకు థియేటర్స్ కి ప్రేక్షకులు కదిలి వస్తారా.. థియేటర్స్ ఫుల్ అవుతాయా.. ఈ అంశం మీద ప్రేక్షకులే కాదు.. అందరూ ఆశక్తిగా ఉన్నారు. 

ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటరు సినిమా బిజినెస్ పూర్తయినా, సాటిలైట్, డిజిటల్ రైట్స్ అన్ని రకాలుగా నిర్మాతలు హ్యాపీగానే ఉన్నా.. బట్ థియేట్రికల్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో అనేది మాత్రం అందరిలోనూ ఓ టెంక్షన్, ఓ క్యూరియాసిటీ సోలో బ్రతుకే సో బెటరు క్రియేట్ చేసింది. ఈ డిసెంబర్ 25 న ఈ సినిమా ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి. అసలు అందరికన్నా ఎక్కువగా సాయి ధరమ్ తేజ్ కి ఈ సినిమాలో నటించిన హీరోయిన్ నాభ నటేష్, దర్శకనిర్మాతలు ఎక్కవగా టెంక్షన్ పడుతున్నారు. ఎందుకంటే అందరికన్నా ముందే ఈ సినిమాని థియేటర్స్ లో ఓపెన్ చేస్తున్నారు కాబట్టి. 

సోలో బ్రతుకే సో బెటరు సినిమా థియేటర్స్ రెస్పాన్స్ కోసం ముఖ్యంగా మూవీ టీం తో పాటుగా ఇతర సినిమాల హీరోలు ఎదురు చూస్తున్నారు. ఒకవేళ సోలో బ్రతుకే థియేటర్స్ రెస్పాన్స్ బావుంటే.. తమ సినిమాలను విడుదల చేసేందుకు, డేట్స్ ఇచ్చేందుకు రెడీ అవుదామని.! 

Everyone's eyes are on that ..!:

Solo Brathuke so better theater chart released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ