Advertisementt

అక్క అలాగ.. చెల్లెలు ఇలాగ..!

Sat 19th Dec 2020 05:23 PM
sanjana,drugs case,nikki,puppies  అక్క అలాగ.. చెల్లెలు ఇలాగ..!
Like older sister .. Like younger sister ..! అక్క అలాగ.. చెల్లెలు ఇలాగ..!
Advertisement
Ads by CJ

బుజ్జిగాడు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సంజన గలరాణిని తెలుగు పరిశ్రమ పక్కనబెడితే.. కన్నడ పరిశ్రమలో చిన్న చిన్న అవకాశాలతో పెద్ద సహవాసాలతో  డ్రగ్స్ కేసులో ఇరుక్కుని మూడు నెలలు జైలు జీవితం గడిపి అతి కష్టం మీద బెయిల్ పై విడుదలైన సంజన ఎట్టకేలకి ఇంటి మొహం చూసింది. లాక్ డౌన్ లో సగం కాలం సంజన జైల్లోనే గడిపింది. మరి సంజన అలా అయితే.. ఆమె చెల్లెలు నిక్కీ గల్రాని తాను మాత్రం ఎక్కడికి బయటికి వెళ్లకుండా కుక్కపిల్లలతో ఇంట్లోనే ఆడుకుంటూ క్వారంటైన్ లైఫ్ ని గడుపుతూ ఎంజాయ్ చేస్తుంది. ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్స్ కోసం ఎయిర్ పోర్ట్స్ లో తళుక్కున మెరుస్తున్న నిక్కీ గల్రాని ఫోటో షూట్స్ తో అదరగొట్టేస్తుంది.

లాక్ డౌన్ క్వారంటైన్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూనే ఫోటో షూట్స్ తో యూత్ కి ఏం కావాలో ఇంట్లోనే కూర్చుని చూపిస్తుంది. సంజన గ్లామర్ గర్ల్ గా సినిమా అవకాశాల కోసం వేచి చూస్తూనే డ్రగ్స్ కేసులో ఇరుక్కుపోయింది.. పాపం సంజన లైఫ్ అలా ఉంటే.. చెల్లాయ్ నిక్కీ మాత్రం ఇంట్లోనే ఎంజాయ్ చేస్తూ కుక్క పిల్లలతో ఆడుకుంటూ ఫొటోస్ తో కట్టిపడేస్తుంది. గ్లామర్ కి గ్లామర్.. ఎంజాయ్మెంట్ కి ఎంజాయ్మెంట్ తో నిక్కీ గల్రాని హ్యాపీ గా కనబడుతుంది. కానీ డ్రగ్స్ కేసు విషయంలో సంజన మాత్రం బిక్కు బిక్కు మంటూ గడుపుతుంది. అందుకే అక్క అలాగ చెల్లెలు ఇలాగ అన్నది.

Like older sister .. Like younger sister ..!:

Sanjana's enjoyment with drugs  - Nikki's enjoyment with puppies

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ