Advertisementt

నాలుగో పెళ్లంటే నవ్విపోతారు.!

Sat 19th Dec 2020 03:58 PM
vanitha vijay kumar,4t wedding,living relation  నాలుగో పెళ్లంటే నవ్విపోతారు.!
4th marriage! What is this?! నాలుగో పెళ్లంటే నవ్విపోతారు.!
Advertisement
Ads by CJ

సీనియర్ నటీనటులు మంజుల - విజయ్ కుమార్ ల కుమార్తె వనితా విజయ్ కుమార్ నటిగా సక్సెస్ కాలేకపోయింది కానీ.. తన పెళ్లిళ్లతో బాగా పాపులర్ అయ్యింది. ఎందుకంటే ఆమె పెళ్లి చేసుకోవడం, విడాకులు తీసుకోవడంతో ఎప్పుడు బాగా బిజీ. 2000 లో సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకున్న వనిత తల్లితండ్రులు విజయ్ కుమార్  - మంజుల ఫ్యామిలీతో దూరంగా ఉంటుంది. తర్వాత మొదటి భర్తతో ఏడేళ్ల సంసారిక జీవితానికి విడాకులతో స్వస్తి చెప్పింది. మొదటి భర్తతో విడాకులైన అదే ఏడాది వ్యాపార వేత్తతో పెళ్లి పీటలెక్కింది. తర్వాత మళ్ళీ నాలుగేళ్లకు అతనికి విడాకులిచ్చిన వనితా విజయ్ కుమార్ మరోసారి పెళ్లి అనకుండా లివింగ్ రిలేషన్ లో గడిపింది.

డాన్స్ మాస్టర్ తో నాలుగేళ్ళు లివింగ్ రిలేషన్ లో ఉన్న వనిత అతనికి బ్రేకప్ చెప్పి ఈ ఏడాది లాక్ డౌన్ లో పీటర్ ని పెళ్ళాడి సంచలనాలకు తెర లేపింది. పీటర్ పెళ్లితో వనిత మీడియాకి అడ్డంగా దొరికింది. పీటర్ మొదటి భార్యకి విడాకులివ్వకుండానే వనితని పెళ్లి చేసుకోవడంతో.. అది కాస్త కోర్టుకెక్కింది. కోర్టు కేసు మాత్రమేనా సెలబ్రిటీస్ నుండి కూడా వనిత విజయ్ కుమార్ పై పలుకామెంట్స్ వచ్చాయి. ఆ మూడో పెళ్లి ముచ్చట ముణ్ణాళ్లకే ముగిసిపోయింది. పీటర్ వనితని వదిలి పారిపోయాడు. 

మరి వనితని పీటర్ వదిలేసిన రెండు నెలలకే మళ్ళీ వనితా విజయ్ కుమార్ ప్రేమలో పడినట్లుగా ట్వీట్ చేసి షాకిచ్చింది. మళ్ళీ ప్రేమలో పడ్డా అంటూ ట్వీట్ చేసిన వనిత.. ఇప్పుడు ఎవరితో ప్రేమాయణం నడుపుతుంది.. ఎవరిని పెళ్లి చేసుకుంటుందో అనే క్యూరియాసిటిలో జనాలు ఉన్నారు.

4th marriage! What is this?!:

Vanitha Vijay Kumar to get married 4th time 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ