బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ గా కూల్ పర్సన్ అభిజిత్ ని అందరూ ఫిక్సయిపోయారు. దాదాపుగా అభిజిత్ విన్నర్ టైటిల్ ని పట్టుకుపోవచ్చని అనుకుంటున్న సమయంలో బిగ్ బాస్ లో భారీ ట్విస్ట్ కి ప్లాన్ జరుగుతుంది అనే సంకేతాలు అందుతున్నాయి. బిగ్ బాస్ రియాలిటీ షో అని స్ట్రాంగ్ గానే చెబుతున్నప్పటికీ.. అప్పుడప్పుడు బిగ్ బాస్ స్క్రిప్టెడ్ షో లానే కనిపిస్తుంది. ఈ సీజన్ 4 లో మోనాల్ విషయంలో బిగ్ బాస్ లో పెద్ద స్క్రిప్ట్ నడిచింది అని బుల్లితెర ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు కూడా. మోనాల్ ని ప్రేక్షకులు బయటికి పంపాలని చూస్తే బిగ్ బాస్ ప్లాన్ లో భాగంగా మోనాల్ హౌస్ లోనే కొనసాగింది. ఇక తాజాగా మరో భారీ ట్విస్ట్ ఇవ్వడానికి బిగ్ బాస్ యాజమాన్యం ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అది ఈసారి అబ్బాయిలకు టైటిల్ ఇవ్వకుండా తమ ప్లాన్ ప్రకారం అమ్మాయిలకు టైటిల్ ఇచ్చే ఏర్పాట్లు జరిగితున్నాయని అంటున్నారు..
అందులో భాగంగానే అభిజిత్ వైపు ఉన్న ట్రోఫీ గాలి అరియనా వైపు తిరిగినట్టుగా చెబుతున్నారు. గత సీజన్స్ లో అమ్మాయిలని టాప్ 2 వరకు తీసుకొచ్చి అబ్బాయిలకు టైటిల్ ని ఇవ్వడం జరుగుతుంది. కాని ఈసారి ఆ సెంటిమెంట్ ని మార్చి అమ్మాయిలను రంగంలోకి దింపాలని, అందరిలో స్ట్రాంగ్ అయిన అరియనకు ఈసారి బిగ్ బాస్ ట్రోఫీ అందించే ఏర్పాట్లు జరుగుతూన్నాయనే టాక్ వినిపిస్తుంది. మరి ఓట్స్ పరంగా అభిజిత్ టాప్ లో ఉంటే ఆ తర్వాత అఖిల్, సోహైల్ ఉన్నారని అంటున్నారు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ స్క్రిప్ట్ ప్రకారం అరియానా ఓటింగ్స్ లో ముందంజలోకి వచ్చేసింది అని అంటున్నారు. మరి ఓటింగ్స్ పక్కనబెట్టి ఈసారి బిగ్ బాస్ ప్లాన్ మార్చి అరియనకు టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఇవ్వబోతున్నట్లుగా టాక్ అయితే గట్టిగా ఉంది.