బిగ్ బాస్ హౌస్ చూస్తుంటే బోర్ కొడుతోంది. కారణం ఇంటి నిండా కంటెస్టెంట్స్ లేరు. ఆసక్తికర టాస్క్ లు లేవు. కరోనా కారణముగా బిగ్ బాస్ పార్టీ లేదు. కేవలం ఐదుగురు కంటెస్టెంట్స్ ని వారం రోజులుగా చూస్తున్న బిగ్ బాస్ ప్రేక్షకులు చెబుతున్న మాట. అందుకే ఆదివారం ఫినాలే ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక సీజన్ 4 గ్రాండ్ టైటిల్ ని అఖిల్ ఆర్ అభిజిత్ ఆర్ అరియనా ఆర్ సోహైల్ ఆర్ హరికలో ఎవరికో ఒకరికి దక్కుతుంది. కాని అందరిలో ఓట్స్ విషయంలో స్ట్రాంగ్ ఉన్న అభిజిత్ కే ఈ సీజన్ 4 విన్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.
కానీ ఆటల్లో ఆసక్తి చూపని అభిజిత్ కనీసం ఈ సీజన్ కి కెప్టెన్ కూడా అవ్వలేకపోయాడు. అమ్మాయిలు కూడా గట్టిగా ఆది కెప్టెన్ అయిన బిగ్ బాస్ లో అభిజిత్ మాత్రం కెప్టెన్ కాలేక అలానే ఉండిపోయాడు. అలాగే ఈ సీజన్ వరెస్ట్ పెరఫార్మెర్ గా అతనకి అతనే ప్రకటించుకున్న అభిజిత్ విన్నర్ ఎలా అవుతాడంటా అఖిల్, సోహైల్ ఫాన్స్ అభిజిత్ ఫాన్స్ మీద రివర్స్ అవుతున్నారు. కానీ ఈ వారం టాస్క్ ల్లో విజేత అయ్యి, అలాగే పెరఫారెన్స్ పరంగా టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ లేదు. కేవలం ఓటింగ్ శాతాన్ని బట్టే ఫైనల్ విన్నర్ ని ప్రకటిస్తారు. ఓట్స్ పరంగా ముందున్న అభిజిత్ ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో దొరికిపోవడం అభిజిత్ ఫాన్స్ ని కలవరపెడుతుంది. మా అభిజిత్ సీజన్ 4 విన్నర్ అని ఫిక్స్ అయినా ఎక్కడో ఏదో మూల వాళ్ళకి డౌట్ కొడుతోంది. చూద్దాం ఈ ఆదివారం రాత్రి తొమ్మిదికల్లా అభిజిత్ విన్ అవుతాడో.. లేదో.. తేలిపోతుంది.