Advertisementt

‘సోలో..’ బెటరే కానీ.. ‘కపటధారి’లోనే డౌటు!

Fri 18th Dec 2020 01:16 PM
sumanth,kapatadhaari,solo brathuke so better,saitej,corona,december release  ‘సోలో..’ బెటరే కానీ.. ‘కపటధారి’లోనే డౌటు!
Solo Brathuke So Better Promotions in Full Swing ‘సోలో..’ బెటరే కానీ.. ‘కపటధారి’లోనే డౌటు!
Advertisement
Ads by CJ

ఎనిమిది నెలలుగా థియేటర్స్ మొత్తం బోసిపోతున్నాయి. కరోనా కారణంగా మూతబడిన థియేటర్స్ ఈమధ్యనే తెరుచుకున్నాయి. పాత సినిమాలతో థియేటర్స్ యాజమాన్యాలు కాలక్షేపం చేస్తున్నాయి. వచ్చే క్రిస్మస్ నుండి కొత్త సినిమాల సందడి మొదలు కాబోతుంది. టాలీవుడ్‌లో ముందుగా మెగా మేనల్లుడు సాయి తేజ్ సాహసం చేస్తున్నాడు. ఆయన నటించిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమాని ఈ క్రిస్మస్ కానుకగా థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ, ప్రెస్ మీట్స్ అంటూ సినిమాపై క్రేజ్ తేవడానికి పబ్లిసిటీ స్టెంట్స్ మొదలు పెట్టారు. ఇక మరో హీరో సుమంత్ కపటధారి కూడా క్రిస్మస్ రిలీజ్ అన్నాడు.. ఆ సినిమా గురించి పెద్దగా పబ్లిసిటీ లేదు. అసలే థియేటర్స్ మూతబడి ఉన్నాయి. అలాంటప్పుడు పబ్లిసిటీతోనే క్రేజ్ పెంచి సినిమాని థియేటర్స్ లో దింపాలి. కానీ ఇలా లైట్ గా కూర్చుని దేవుడి మీద భారం వెయ్యడం ఎంతవరకు కరెక్ట్.

సోలో బ్రతుకే సో బెటర్ సినిమా సాంగ్స్ ని ఒక్కొక్కటిగా వదులుతున్నారు. ఇక హీరో ఇంటర్వ్యూ, హీరోయిన్ నభా నటేష్ ఇంటర్వూస్, రిలీజ్ ప్రెస్ మీట్స్ అంటూ హడావిడి చేస్తేగాని సినిమాలు ప్రేక్షకుల వద్దకు వెళ్లవు. ఓటీటీలో అయితే ప్రమోషన్స్ తో పనిలేనట్టు కూర్చున్న హీరోలకు.. థియేటర్స్ రిలీజ్ విషయంలో పబ్లిసిటీకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో కొత్తగా చెప్పక్కర్లేదు. మరి పేపర్ యాడ్స్ లాంటివి కూడా సినిమా పబ్లిసిటీ‌లో కీలక పాత్ర పోషిస్తాయి. కుర్ర హీరోలు కరోనా టైం లో ధైర్యం చేసి సినిమాని విడుదల చేస్తున్నారంటే దానికి తగినట్లుగా కష్ట పడాల్సిందే. ప్రేక్షకులకు అనుకున్నట్టుగా సినిమా రీచ్ కాకపోతే థియేటర్స్‌లో సినిమాని విడుదల చేసిన ఉపయోగం ఉండదు. మరి సుమంత్ కూడా మళ్లీ రావా, సుబ్రమణ్యపురం సినిమాలతో లైన్‌లో కొచ్చాడు. ఇప్పుడు కపటధారిపై ఎంతో కొంత అంచనాలుంటాయి. మరి పబ్లిసిటీ పర్ఫెక్ట్‌గా ఉంటే.. అలాగే సినిమాలో కంటెంట్ ఉంటే సినిమాలు సక్సెస్ అవడం ఖాయం. 

Solo Brathuke So Better Promotions in Full Swing :

No Promotions to Sumanth Kapatadhaari Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ