Advertisementt

అన్న డిసైడ్ చేస్తే.. తమ్ముడు దిగుతాడన్నమాట!

Fri 18th Dec 2020 10:22 AM
uppena,solo brathuke so better movie,panja vaishnav tej,sai tej,december 25th  అన్న డిసైడ్ చేస్తే.. తమ్ముడు దిగుతాడన్నమాట!
Panja Vaishnav Tej waiting for His Brother Movie Result అన్న డిసైడ్ చేస్తే.. తమ్ముడు దిగుతాడన్నమాట!
Advertisement
Ads by CJ

మెగా మేనల్లుళ్లు ఇద్దరూ హీరోలుగా ఎంట్రీ ఇచ్చేశారు. అందులో సాయితేజ్ మీడియం రేంజ్ హీరోగా ఎదిగాడు. వరస సినిమాలతో బిజీగా ఉన్న సాయితేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా ఉప్పెనతో హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇద్దామనుకున్నాడు. కానీ కరోనాతో ఖంగు తిన్నాడు. బుచ్చిబాబు దర్శకుడిగా వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఉప్పెన సినిమా మార్చిలో విడుదల కావాల్సింది. కానీ కరోనా వైష్ణవ్ తేజ్ హీరోయిజాన్ని అడ్డుకుంది. లేదంటే హీరోగా ఈపాటికి వైష్ణవ్ తేజ్ వరస సినిమాలతో బిజీగా ఉండేవాడు. ఇక ఉప్పెన సినిమా విడుదల విషయం పక్కనబెట్టి క్రిష్ తో మరో సినిమా కూడా పూర్తి చేసేశాడు వైష్ణవ్ తేజ్. లో-బడ్జెట్ మూవీ చేసిన వైష్ణవ్ తేజ్ థియేటర్స్ ఓపెన్ అయినా ఉప్పెన సినిమా విడుదల విషయం మాట్లాడడం లేదు.

అయితే వైష్ణవ్ తేజ్ మాత్రం తన అన్న నటించిన సినిమా సోలో బ్రతుకే సో బెటర్ థియేటర్స్ లో మరో పది రోజుల్లో విడుదల కాబోతుంది. ఆ సినిమా రెస్పాన్స్ చూసి ఉప్పెన విడుదల విషయం గురించి ఆలోచించేలా కనబడుతున్నాడు కుర్రాడు. ఉప్పెన సినిమాకి ఓటీటీ భారీ ఆఫర్ ఇచ్చినా.. థియేటర్స్ రిలీజ్ కోసం చూస్తున్న వైష్ణవ్ తేజ్ వాళ్ళు.. ఇప్పుడు థియేటర్స్ ఓపెన్ అయినా వాటి రెస్పాన్స్‌కి భయపడి వెనక్కి తగ్గుతున్నారు. మరి వచ్చే క్రిస్మస్‌కి సాయితేజ్ సోలో బ్రతుకే సో బెటర్ రెస్పాన్స్ చూసి అప్పుడు ఉప్పెన డేట్ లాక్ చేయాలని డిసైడ్ అయ్యారేమో చూడాలి. విజయ్ సేతుపతి విలన్ గా నటించిన ఉప్పెన సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

Panja Vaishnav Tej waiting for His Brother Movie Result:

Uppena hopes on solo brathuke so better result

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ