Advertisementt

ఆది పినిశెట్టి ఆట పూర్తిగా ఆడేశాడు

Wed 16th Dec 2020 10:19 PM
aadhi pinisetty,clap movie,shooting,akanksha singh  ఆది పినిశెట్టి ఆట పూర్తిగా ఆడేశాడు
Aadhi Pinisetty Clap Movie shooting completed ఆది పినిశెట్టి ఆట పూర్తిగా ఆడేశాడు
Advertisement
Ads by CJ

ఆది పినిశెట్టి, ఆకాంక్ష సింగ్ జంట‌గా శ‌ర్వంత్ రామ్ క్రియేష‌న్స్‌, శ్రీ షిర్డీసాయి మూవీస్ ప‌తాకాల‌పై రామాంజ‌నేయులు జ‌వ్వాజి, ఎం. రాజ‌శేఖ‌ర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘క్లాప్‌’. బిగ్ ప్రింట్ పిక్చ‌ర్స్ అధినేత ఐ.బి. కార్తికేయ‌న్ స‌మ‌ర్పిస్తున్నారు. పృథివి ఆదిత్య ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌ ఎంట‌ర్‌టైన‌ర్‌గా త‌యార‌వుతున్న ‘క్లాప్’‌ షూటింగ్ పూర్త‌యింది. లాక్‌డౌన్ త‌ర్వాత ఇటీవ‌ల‌ చెన్నైలో షూటింగ్ పున‌రుద్ధ‌రించి పూర్తి చేశారు. 65 వ‌ర్కింగ్ డేస్‌లో చిత్ర బృందం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసింది. దీనికి సంబంధించి యూనిట్ ఓ వీడియోను రిలీజ్ చేసింది. చివ‌రి రోజు చివ‌రి సీన్ చిత్రీక‌రించాక‌, హీరో ఆది పినిశెట్టి, డైరెక్ట‌ర్ పృథివి ఆదిత్య స‌హా యూనిట్ మెంబ‌ర్స్ ఒక‌రినొక‌రు కౌగ‌లించుకొని సెల‌బ్రేట్ చేసుకున్నారు.

తాము ఊహించిన దానికి మించి స‌న్నివేశాలు చాలా బాగా వ‌చ్చాయనీ, చెన్నైలోని ఓ భారీ స్టేడియంలో చిత్రీక‌రించిన స్పోర్ట్స్ బేస్డ్ సీన్లు హైలైట్ అవుతాయ‌నీ నిర్మాత‌లు తెలిపారు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రిపి, త్వ‌ర‌లో చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తామ‌న్నారు.

తారాగ‌ణం:

ఆది పినిశెట్టి, ఆకాంక్ష సింగ్‌, కృష్ణ కురుప్‌, నాజ‌ర్‌, ప్ర‌కాష్ రాజ్‌, రాందాస్‌, బ్ర‌హ్మాజీ

సాంకేతిక బృందం:

ద‌ర్శ‌క‌త్వం: పృథివి ఆదిత్య‌

నిర్మాత‌లు: రామాంజ‌నేయులు జ‌వ్వాజి, ఎం. రాజ‌శేఖ‌ర్ రెడ్డి

స‌మ‌ర్ప‌ణ‌: బిగ్ ప్రింట్ పిక్చ‌ర్స్ ఐ.బి. కార్తికేయ‌న్‌

బ్యాన‌ర్స్‌: శ‌‌ర్వంత్ రామ్ క్రియేష‌న్స్‌, శ్రీ షిర్డీసాయి మూవీస్‌

సంగీతం: మేస్ట్రో ఇళ‌య‌రాజా

సినిమాటోగ్ర‌ఫీ: ప్ర‌వీణ్ కుమార్‌

ఎడిటింగ్‌: రాగుల్‌

ఆర్ట్‌: వైర‌బాల‌న్‌, ఎస్‌. హ‌రిబాబు

ఫైట్స్‌: ఆర్‌. శ‌క్తి శ‌ర‌వ‌ణ‌న్

కొరియోగ్ర‌ఫీ: దినేష్ మాస్ట‌ర్‌

పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌

Aadhi Pinisetty Clap Movie shooting completed:

Clap Movie shooting Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ