Advertisementt

అందుకు సిద్ధపడే పెళ్లి చేసుకున్నా: సమంత

Wed 16th Dec 2020 07:57 PM
samantha,lucky heroine,marriage,movie offers,after marriage  అందుకు సిద్ధపడే పెళ్లి చేసుకున్నా: సమంత
Samantha sensational comments on her Marriage అందుకు సిద్ధపడే పెళ్లి చేసుకున్నా: సమంత
Advertisement
Ads by CJ

చాలామంది హీరోయిన్లకి పెళ్లి అవగానే అవకాశాలు దరిదాపులకు కూడా రావు. అందుకే హీరోయిన్స్ పెళ్లి చేసుకోవడానికి వెనకా ముందు ఆలోచిస్తారు. కానీ సమంత ఏ వయసులో ముచ్చట ఆ వయసులోనే తీర్చుకోవాలంటూ చైతూని ప్రేమించి పెళ్లాడింది. అయినా సమంత క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు. పెళ్లి తర్వాత క్రేజీ అవకాశాలతో దూసుకుపోతుంది. మరి సమంతకి ఇప్పటికీ సినిమా అవకాశాల జోరు ఏమాత్రం తగ్గలేదు. దానికి కారణం ప్రతిభ మాత్రమే కాదు.. కాస్త అదృష్టం కూడా ఉండాలి అంటుంది సమంత. పెళ్లి తర్వాత కూడా వరస ఆఫర్స్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నానంటే దానికి కారణం అదృష్టమే అంటుంది సమంత.

 

అసలు హీరోయిన్స్ పెళ్లి చేసుకుంటే కెరీర్ పోతుంది, కెరీర్‌కి పెళ్లి అడ్డంకి కాదని నిరూపించడానికి తాను పెళ్ళికి ముందు ప్లాన్స్ ఏమి చేసుకోలేదని, అందరిలా పెళ్లి తర్వాత తన కెరీర్ ముగిసిపోయింది అని, అవకాశాలు ఇక రావనే అనుకున్నాను అని అంటుంది. అందుకు సిద్ధపడే చైతుతో పెళ్లి పీటలెక్కా అంటుంది సమంత. కాని అదృష్టం కొలది.. తనకి పెళ్లి తర్వాత మంచి ఆఫర్స్ వచ్చి రంగస్థలం, ఓ బేబీ, మహానటి, మజిలీ లాంటి మంచి సినిమాలు చేశా అంటుంది. ఇదంతా కేవలం అదృష్టం వలనే సాధ్యమైంది అంటూ కుండబద్దలు కొట్టింది అక్కినేని సమంత.

Samantha sensational comments on her Marriage :

Samantha the lucky Heroine 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ