Advertisementt

రవితేజకి రంగమ్మత్తకి ఇంట్రెస్టింగ్ ఫైట్

Wed 16th Dec 2020 07:27 PM
anchor anasuya,ravi teja,ramesh varma,khiladi movie  రవితేజకి రంగమ్మత్తకి ఇంట్రెస్టింగ్ ఫైట్
Interesting fight between Ravi Teja and Rangammatta రవితేజకి రంగమ్మత్తకి ఇంట్రెస్టింగ్ ఫైట్
Advertisement
Ads by CJ

రంగస్థలం సినిమాతో రంగమ్మత్తగా అందరి ప్రశంశలు అందుకున్న అనసూయ.. ప్రతి వారం జబర్దస్త్ లో కుర్రకారుని కవ్విస్తూనే ఉంది. అయితే అనసూయ సినిమాల ఎంపిక లో మాత్రం ఆచి తూచి వ్యవహరించడం విశేషం. సినిమాల ఎంపికలో చాలా సెలెక్టీవ్ గా ఉంటూ వస్తోన్న అనసూయ రీసెంట్ గా రవితేజ సినిమాకి మాత్రం సింగిల్ సిట్టింగ్ లో ఇమ్మిడియట్ గా ఓకె చెప్పేసి నెక్స్ట్ డే లొకేషన్ కి కూడా వెళ్లిపోవడం జరిగిందని తెలుస్తోంది. మాస్ మహారాజ రవితేజా - రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మ కాంబోలో తెరకెక్కుతున్న ఖిలాడీ సినిమాలో అనసూయ కీలక పాత్ర చెయ్యడానికి ఇమ్మిడియట్ గా ఓకె చెప్పిందట.

అయితే రవితేజ ఖిలాడీ సినిమాలో అనసూయ ఒప్పుకున్న ఆ కీలక పాత్ర అల్లాటప్పా పాత్ర కాదని అల్లాడించే కారెక్టర్ అని, రవితేజ పాత్రతో అనసూయ పాత్ర ఢీ అంటే ఢీ అనే పాత్ర అని, రవితేజ - అనసూయ  మధ్యన హోరాహోరి ఫైట్ ఉండబోతుందని సమాచారం. అందుకే అనసూయ ఈ పాత్రకి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి.. రంగంలోకి దిగిపోయిందేమో.!

దీనిని బట్టి అనసూయ రవితేజ సినిమాలో ఎలాంటి రోల్ చేస్తోందో ఆడియెన్స్ ఈజీగా గెస్ చేసేస్తారు.. ఎందుకంటే అసలు ఖిలాడీలు వాళ్లేగా !!

Interesting fight between Ravi Teja and Rangammatta:

Anchor Anasuya Interesting role in Khiladi movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ