Advertisementt

ఎక్సపెర్ట్ నుంచి వస్తోన్న ఎక్సపెరిమెంట్

Wed 16th Dec 2020 06:49 PM
118 movie,k.v guhan,www,shivani  ఎక్సపెర్ట్ నుంచి వస్తోన్న ఎక్సపెరిమెంట్
Experiment coming from Expert ఎక్సపెర్ట్ నుంచి వస్తోన్న ఎక్సపెరిమెంట్
Advertisement
Ads by CJ

ఎన్నో భారీ చిత్రాలకు ఎక్సట్రార్డినరీ ఫోటోగ్రఫీ అందించి.. విజువల్స్ విషయంలో ఎక్సపెర్ట్ అనిపించుకున్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహ‌న్ 118 అనే సినిమాతో దర్శకుడిగా మారి నందమూరి కళ్యాణ్ రామ్ కి సూపర్ సక్సెస్ అందించారు. ఆ సినిమాతో ఎన్నో ప్రశంశలు దక్కిన దర్శకుడిగా గ్యాప్ తీసుకున్న గుహన్ మళ్ళీ మరో సైక్లాజికల్ థ్రిల్ల‌ర్‌ తో త్వరలో ఆడియన్స్ ని పలకరించబోతున్నారు. 'డ‌బ్లూడ‌బ్లూడ‌బ్లూ'(హూ,వేర్‌,వై) టైటిల్ తో అథిత్ అరుణ్‌ - శివాని రాజ‌శేఖ‌ర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాని రామంత్ర క్రియేష‌న్స్ ప‌తాకంపై డా. ర‌వి పి. రాజు ద‌ట్ల నిర్మిస్తున్నారు.

డ‌బ్లూడ‌బ్లూడ‌బ్లూ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. 118 తో సక్సెస్ అయిన గుహన్.. ఈ డిఫరెంట్ థ్రిల్లర్ డ‌బ్లూడ‌బ్లూడ‌బ్లూ తో ఖచ్చితంగా హిట్ కొట్టేలాగే కనిపిస్తున్నాడు. డ‌బ్లూడ‌బ్లూడ‌బ్లూ సినిమాకి సిమ‌న్ కె. కింగ్ సంగీత సార‌థ్యం వ‌హిస్తుండ‌గా మిర్చికిర‌ణ్ ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ అందిస్తున్నారు.

Experiment coming from Expert:

'118' Director KV Guhan's Latest Film Titled 'WWW'

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ