ఒక్కప్పుడు హీరోగా లక్కు పరీక్షించుకున్న రాహుల్ రవీంద్రన్.. తర్వాత నటుడిగా అవకాశాలు తగ్గాక దర్శకుడిగా మారాడు. చి. ల. సౌ సినిమాతోనే దర్శకుడిగా తానేమిటో నిరూపించుకున్న రాహుల్ రవీంద్రన్ తర్వాత చాలా ఆఫర్స్ వచ్చినా.. అవన్నీ పక్కనబెట్టి అక్కినేని నాగార్జున తో మన్మధుడు 2 అంటూ.. సూపర్ హిట్ అయిన మన్మధుడు కి సీక్వెల్ ట్రై చేసి కోలుకోలేని దెబ్బతిన్నాడు. చి. ల. సౌ చూసిన మన్మధుడు 2 చూసి పెదవి విరిచారు. దానితో దర్శకుడిగా రాహుల్ అవకాశాలు వెనక్కి పోయాయి. అయితే మన్మధుడు 2 తో అక్కినేని ఫాన్స్ మైండ్ బ్లాక్ చేసిన రాహుల్ రవీంద్రన్ సారు ఇప్పుడు మెగా ఫోన్ కి దూరమై మళ్ళి మేకప్ వేసుకోవాల్సి వస్తోంది.
హీరో నాని సినిమాలో రాహుల్ రవీంద్రన్ కేరెక్టర్ ఆర్టిస్ట్ గా మారబోతున్నాడట. ప్రస్తుతం నాని వరస సినిమాలతో అసలు ఖాళీగా లేడు. కరోనా టైం లో ఖాళీగా ఉన్నాడేమో కానీ ప్రస్తుతం .. నాని డైరీ సినిమాలతో ఫుల్.. ఇప్పుడు వరసగా టక్ జగదీశ్, శ్యాం సింగ రాయ్ సినిమాలు చేస్తున్న కి అన్నగా రాహుల్.. శ్యామ్ సింగ రాయ్ లో కనిపించబోతున్నాడట. కెరీర్ ని పర్ఫెక్ట్ ప్లానింగ్ తో సరిద్దుకోలేని ఈ కుర్ర డైరెక్టర్ హీరో నుండి కేరెక్టర్ ఆర్టిస్ట్ గా మారాల్సి వచ్చింది అని అంటున్నారు.