ఈమధ్యన ఏ హీరోయిన్ మీద రాని గాసిప్స్, రూమర్స్, న్యూస్ లు రకుల్ మీదే వచ్చాయి. రూమర్స్ అయినా, గాసిప్స్ అయినా రకుల్ మీద వచ్చినన్ని మరే హీరోయిన్ మీద రాలేదు. రకుల్ ప్రీత్ పైనపోయింది. అందుకే అవకాశాలు రావడం లేదు. అమ్మడుకి తెలుగులో గడ్డు కాలమే అని మాత్రమేనా.. బాలీవుడ్ డ్రగ్స్ కేసులో రకుల్ మీద రకరకాలుగా ప్రచారం జరిగింది. రకుల్ మాత్రం మీడియా టార్చెర్ తట్టుకోలేక కోర్టుకెక్కింది.. కోర్టు మీడియాకి అక్షింతలు వేసింది. ఆఖరుకి రకుల్ మీడియాతో క్షమాపణలు కూడా చెప్పించుకుంది. అదంతా పక్కనబెడితే తాజాగా రకుల్ ప్రీత్ సామ్ జామ్ షోకి గెస్ట్ గా వచ్చింది. ఆ షో లో సమంత అడిగే ప్రశ్నలకు రకుల్ రెచ్చిపోయి సమాధానాలు చెప్పింది. నువ్వు ఎవరినైనా బైక్ మీద ఎక్కించుకుంటే ఛార్జ్ చేసేదాన్నివట అని రకుల్ ని సమంత అడగగానే అవును మీకెలా తెలుసు అనేసింది. మాకన్ని తెలుసు అని సమంత కామెడీ చేసింది.
రకుల్ నీ మీద రూమర్స్ ఎక్కువగా వస్తుంటాయి కదా.. నువ్వెందుకు స్పందించవు.. నేనైతే వెంటనే స్పందిస్తా అని సమంత రకుల్ నిఅడగ్గానే.. అమ్మో నా మీద వచ్చే రూమర్స్ మాములుగా ఉండవు. అందుకే పట్టించుకోవడం మానేసాను. మనపై పుకార్లు పుట్టించేవారు మన గురించి అస్సలు ఆలోచించరు. నాకు హైదరాబాద్ లో ఒకరు ఇల్లు గిఫ్ట్ గా కొనిస్తే నేను దాంట్లో ఉంటున్నా అని ప్రచారం చేస్తున్నారు. మరి వాళ్లెవరో ఇల్లు కొంటె నేనెందుకు పని చెయ్యడం.. ఇలాంటి పుకార్లు నా మీద చాలానే వచ్చాయి అంటూ రెచ్చిపోయి సమాధానాలు చెప్పింది రకుల్. మరి సామ్ జామ్ షో లో రకుల్ షో కాస్త ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది.