రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ - ఎన్టీఆర్ కలయికలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ పై ట్రేడ్ లోనే కాదు ప్రేక్షకుల్లోనూ భీబత్సమైన అంచనాలున్నాయి. ఆర్ ఆర్ ఆర్ అప్ డేట్ ఏది వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్ చిత్రీకరణలో ఉన్న రాజమౌళి.. రామ్ చరణ్ - అలియా భట్ కాంబో సీన్స్ ని తెరకెక్కించాల్సి ఉంది. రామ్ చరణ్ నిన్నటివరకు నిహారిక పెళ్ళిలో బిజీగా ఉంటే.. అలియా భట్ తాజాగా బాయ్ ఫ్రెండ్ తో కలిసి గోవా చెక్కేసింది. అయితే ఇపుడు RRR పై ఓ న్యూస్ షాకిస్తుంది. అదేమంటే ఎన్టీఆర్ ఈ సినిమాలో కొమరం భీం పాత్రలో ఆరు రకరాల గెటప్స్ లో కనిపిస్తాడనే ప్రచారం ఉంది.
అయితే ఆ గెటప్స్ లో ఎన్టీఆర్ ఊహించని పాత్రలో కనిపించబోతున్నాడట. ఓ గెటప్ లో ఎన్టీఆర్ ముసలివాడిగా కనిపించబోతున్నాడనే న్యూస్ ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఎన్టీఆర్ చేసే ఆరు పాత్రల్లో ఇది చాలా ప్రత్యేకంగా ఉంటుంది అని.. ఈ పాత్ర కోసం ఎన్టీఆర్ చాలా కష్టపడుతున్నాడని అంటున్నారు. ఇక ఈ సినిమాలో కొమరం భీం సాహసాలను రాజమౌళి బాగా హైలెట్ చేయబోతున్నాడని.. అల్లూరి సీతారామరాజు అంటే అందరికి పరిచయం ఉన్న పాత్ర. కానీ కొమరం భీం అనేది ఎవరికీ పరిచయం లేని పాత్ర కావడంతో.. ఆ పాత్ర సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఎన్టీఆర్ ఫాన్స్ అయితే రాజమౌళి ఎన్టీఆర్ ని ఈ సినిమాతో తారాస్థాయికి తీసుకెళ్లడం ఖాయమంటున్నారు. దీనినిబట్టి ఆర్ ఆర్ ఆర్ లో చరణ్ సీతారామరాజ పాత్రకన్నా ఎన్టీఆర్ కొమరం భీం పాత్రకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందేమో అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.