వెంకటేష్ - వరుణ్ తేజ్ కోబ్రాలుగా నటించిన ఎఫ్ 2 కామెడీ బ్లాక్ బస్టర్ అవడంతో దానికి సీక్వెల్ చెయ్యడానికి దర్శకనిర్మాతలైన అనిల్ రావిపూడి - దిల్ రాజులు సిద్ధమైపోయారు. ఎఫ్ 3 ఇంకా మొదలు కాకుండానే అనిల్ రావిపూడి సినిమాపై అందరిలో ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాడు. వెంకటేష్ పుట్టిన రోజు కానుకగా ఎఫ్ 3 కాన్సెప్ట్ పోస్టర్ ని వదిలింది ఎఫ్ 3 టీం. అందులో వెంకటేష్ - వరుణ్ తేజ్ లు మనీ ట్రాలీ తో నవ్వులు పూయించడానికి రెడీ అయ్యారు. అయితే ఈసారి ఎఫ్ 3 మొత్తం డబ్బు చుట్టూ నే తిరుగుతుందని ఆ కాన్సెప్ట్ పోస్టర్ తోనే అర్ధమైపోయింది. మరి ఎఫ్ 3 లో వెంకీ - వరుణ్ లతో పాటుగా మరో హీరో ఉంటాడని ఆ పాత్రలో రవితేజ కనిపించబోతున్నాడనే న్యూస్ ఉంది.
అసలు మూడో హీరో గురించి అనిల్ రావిపూడి ఎక్కడా చెప్పకుండా హైప్ క్రియేట్ చేస్తున్నాడా? అసలు ఎఫ్ 3 లో మూడు హీరోకి ప్లేస్ ఉందా? లేదా? సోషల్ మీడియా ప్రచారం ప్రకారం రవితేజ - వెంకీ - వరుణ్ ల ఎఫ్ 3 ఫన్ అండ్ ఫ్రస్టేషన్ మాములుగా ఉండదని ప్రచారం జరుగుతుంది. తాజాగా రవితేజ కాదు.. యాక్షన్ హీరో గోపీచంద్ ఎఫ్ 3 లో మరో హీరో గా నటించబోతున్నాడంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే అనిల్ రావిపూడి గోపీచంద్ ని సంప్రదించాడని.. ప్రస్తుతం ప్లాప్స్ లో ఉన్న గోపీచంద్ కూడా ఈ ప్రపోజల్ ని మారుమాట్లాడకుండా ఒప్పేసుకున్నాడనే టాక్ న్యూస్ నడుస్తుంది. మరి ఎఫ్ 3 లో అసలు మరో హీరో ఉంటాడా? ఉంటే అది రవితేజానా లేదంటే గోపీచందా అనేది అనిల్ రావిపూడి స్పందిస్తేనే కానీ తెలియదు.