రాజమౌళి RRR సినిమా షూటింగ్ ని ఓ యజ్ఞంలా చిత్రీకరిస్తున్నాడు. కరోనా లేకపోతె RRR షూటింగ్స్ ఆరామ్స్ గా చిత్రీకరిస్తూ ఈపాటికి పూర్తి చేసేవాడు రాజమౌళి. అసలు ఇప్పటికల్లా RRR షూటింగ్ ఓ కొలిక్కి వచ్చేది. కానీ కరోనా వలన రాజమౌళి ఇప్పుడు RRR షూటింగ్ ని పరిగెత్తించాల్సి వచ్చింది. తాజాగా ఎన్టీఆర్ - రామ్ చరణ్ లు RRR షూటింగ్ లో పాల్గొనడమే కాదు.. సీత పాత్రధారి అలియా భట్ కూడా RRR షూటింగ్ లో జాయిన్ అయ్యింది. అలియా భట్ RRR షూటింగ్ లో పాల్గొనగానే ఇండియా వైడ్ అటెంక్షన్ RRR మీదే ఉంది. అలియా భట్ క్రేజ్ RRR కి ఖచ్చితంగా పనికొస్తుందని అలియా RRR షూటింగ్ లో జాయిన్ అయిన క్షణమే క్లారిటీ వచ్చేసింది. గత వారం అలియా భట్ సన్నివేశాలతో పాటుగా రాజమౌళి క్లైమాక్స్ చిత్రీకరణ చేసినట్లుగా వార్తలొచ్చాయి.
ఇక అలియా భట్ రోల్ RRR లో 15 నిమిషాల పాటే ఉంటుంది.. RRR కి ఆలియా డేట్స్ కూడా చాలా తక్కువే.. తొందరలోనే అలియా భాట్ షూటింగ్ కూడా పూర్తయిపోతుంది అనాన్రు. మరి వరం రోజులపాటు RRR షూటింగ్ లో పాల్గొన్న అలియా భట్ అప్పుడే చిన్న విరామం తీసుకుని ముంబై చెక్కేసింది. ముంబై కి వెళ్ళగానే అలియా భట్ తన బాయ్ ఫ్రెండ్ రన్బీర్ కపూర్ తో కలిసి గోవా కి వెళ్లబోతుందట. మరి RRR షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఇలా బాయ్ ఫ్రెండ్ తో వెకేషన్ ప్లాన్ చేసుకోవచ్చు కదా అలియా పాప.. ఇప్పుడు RRR వదిలి ఇలా బాయ్ ఫ్రెండ్ తో షికార్లు అవసరమా.. నీకిది తగునా... అలియా బేబీ.. అలా చేసావేమి.. అంటూ RRR ఫాన్స్ అలియా భట్ పై కామెంట్స్ విసురుతున్నారు.