Advertisementt

2020 బ్లాక్ బస్టర్ ఇయర్ అవుతుంది అనుకుంటే..!

Mon 14th Dec 2020 08:55 PM
ritu varma,2020,block buster,year,corona  2020 బ్లాక్ బస్టర్ ఇయర్ అవుతుంది అనుకుంటే..!
She thought 2020 will be a blockbuster year 2020 బ్లాక్ బస్టర్ ఇయర్ అవుతుంది అనుకుంటే..!
Advertisement
Ads by CJ

తెలుగు హీరోయిన్స్ కి అవకాశాలు రావడమే ఎక్కువ. వచ్చాక నిలదొక్కుకోవడం ఇంకా పెద్ద ఛాలెంజ్. పెళ్లి చూపులు తర్వాత స్టార్ హీరోయిన్ అవుతుంది.. రీతూ వర్మ డైరీ ఫుల్ అవుతుంది అనుకుంటే పిలిచి అవకాశం ఇచ్చిన హీరోనే కనబడలేదు. ఎలాగో తమిళనాట అడుగుపెడితే అక్కడ విక్రమ్ ధృవ్ నచ్చత్రం విడుదలకు నోచుకోవడం లేదు. మరోపక్క మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తో తెలుగు, తమిళంలో కనులు కనులను దోచాయంటే అంటూ బ్లాక్ బస్టర్ కొట్టడంతో రీతూ వర్మకి ఇక భారీ అవకాశాలు ఖాయం. అమ్మడు కూడా నాలుగైదు సినిమాలు ఒప్పుకుని షూటింగ్స్ తో బిజీ అవ్వాలనుకుంది. కానీ కరోనా వలన రీతూ వర్మ అనుకున్నవన్నీ వెనక్కి వెళ్లిపోయాయి.

అందుకే కరోనా వలన చాలా నష్టపోయా అంటుంది రీతూ వర్మ. లాక్ డౌన్ ముందు షూటింగ్స్ తో క్షణం తీరిక లేకుండా గడిపాను. కనులు కనులను దోచాయంటే హిట్ తర్వాత చేతిలో నాలుగైదు సినిమా షూటింగ్స్ తో బాగా బిజీగా ఉంటా అనుకుంటే లాక్ డౌన్ తో ఇంట్లోనే కూర్చోవలసి వచ్చింది. కనులు కనులను దోచాయంటే హిట్ అయ్యాక చాలా హ్యాపీ ఫీల్ అయ్యా.. ఏడాదంతా ఇలాగె హ్యాపీగా షూటింగ్స్ చేసుకోవచ్చు అనుకున్నాను. ఒకేసారి నాలుగైదు సినిమా షూటింగ్స్ చేస్తున్నా అవన్నీ ఫినిష్ అయ్యి విడుదలయ్యాక 2020 బ్లాక్ బస్టర్ ఇయర్ అవుతుంది అనుకుంటే..  కరోనా కారణంగా అన్ని ఆగిపోయాయంటుంది రీతూ. లేదంటే నాలుగైదు చిత్రాలైన సక్సెస్ అయ్యి ఇంకా బిజీ అయ్యేదాన్ని అంటూ తెగ ఫీలైపోతుంది.

She thought 2020 will be a blockbuster year:

Ritu varma says she thought 2020 was going to be the best year of her career

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ