నాగబాబు కూతురు నిహారిక పెళ్లి వేడుకలు, రిసెప్షన్ వేడుకలు అంగరంగవైభవంగా ముగియడం, అలాగే కొత్త జంట అన్నవరం సత్యన్నారాయణ స్వామిని దర్శించుకుని నిహారిక అత్తవారింట్లో అడుగుపెట్టింది. అత్తవారింట్లో నిహారిక కొత్త కోడలు హోదాలో పాలు పొంగలి కూడా చేసేసింది. నిహారిక అత్తారింట్లో వేడుకల ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే.. ఇక్కడ సోషల్ మీడియాలో మాత్రం నిహారికపెళ్లి ఖర్చుపై హాట్ హాట్ చర్చలు జరుపుతున్నారు. నాగబాబు కూతురు పెళ్ళికి ఎంత ఖర్చు పెట్టుంటాడు. రాజస్థాన్ లో పెళ్లి చెయ్యడానికి, ఇక్కడ ఇంటి దగ్గర వేడుకలకి కలిపి రమారమి ఎంతై ఉంటుంది అనేది ఇప్పుడు నెటిజెన్స్ ముందున్న పెద్ద ప్రశ్న.
అయితే ఒకరు నిహారిక పెళ్లి బట్టలు నగలు, పెళ్లి ఖర్చులు కలిపి ఓ 50 కోట్లు అంటుంటే.. కాదు 100 కోట్లు అయ్యే ఉంటుంది. మెగా ఫ్యామిలీ పెళ్లంటే ఆమాత్రం ఉండాలి అంటున్నారు. మరి నిహారిక పెళ్లి కూతురు, పసుపు ఫంక్షన్స్ నాగబాబు ఇంటి దగ్గరే చేసేసి.. రాజస్థాన్ ఉదయపూర్ కోటలో మెహిందీ, సంగీత్ పెళ్లి వేడుకలని అంగరంగ వైభవంగా నిర్వహించాడు. ఇక రిసెప్షన్ మాత్రం హైదరాబాద్ లో పెళ్లి కొడుకు చైతన్య తండ్రి నిర్వహించాడు. మొత్తానికి ఏది ఏమైనా నిహారిక పెళ్లి వేడుకల ముచ్చట్లు మాత్రం ముగియలేదు. నిహారిక కట్టుకున్న చీర కాస్ట్ దగ్గరనుండి.. ఆమె వేసుకున్న నగల విలువ, రాజస్థాన్ లో ఆమె విందుకి అయిన ఖర్చు, ప్యాలెస్ అద్దె అన్ని కలిపి 50 నుండి 100 కోట్లవ్వడం పక్కా అంటూ అందరూ ఫిక్స్ అవుతున్నారు.