సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమా షూటింగ్ రంప చోడవరం నుండి హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యింది. అసలు రంప చోడవరం అడవుల నుండి వారణాసి షెడ్యూల్ ప్లాన్ చేసిన సుకుమార్.. ముందు హైదరాబాద్ షెడ్యూల్ కానిచ్చేసి వారణాసి వెళ్లాలని చూస్తున్నాడు. అయితే ఈ సినిమాలో బన్నీ రా లుక్ లో పుష్ప రాజ్ గా మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే పుష్ప లుక్ లో అల్లు అర్జున్ డీ గ్లామర్ అవతారం కనబడుతుంది. కానీ అల్లు అర్జున్ ఫాన్స్ మాత్రం మా సూపర్ స్టైలిష్ హీరో సినిమా మొత్తం డీ గ్లామర్ గానే కనిపిస్తాడా.. అంటూ కాస్త టెంక్షన్ పడుతున్నారు. అలా మరీ మాస్ లుక్ అయితే అల్లు అర్జున్ క్రేజ్ కి డ్యామేజ్ అవుతుంది అని వారు ఫీలవుతున్నారట.
అయితే తాజాగా అల్లు అర్జున్ డీ గ్లామర్ పుష్ప రోల్ సినిమాలో కేవలం 40 నిముషాలు మాత్రమే ఉంటుంది అని.. మిగతా సినిమా మొత్తం అల్లు అర్జున్ స్టైలిష్ లుక్ లోనే కనబడతాడని.. మాస్ లుక్ ఎంతగా హైలెట్ అవుతుందో.. బన్నీ స్టైలిష్ లుక్ కూడా అంతే హైలెట్ అవుతుందని.. అందుకే బన్నీ ధైర్యంగా పుష్ప సినిమాని ఒప్పుకున్నాడంటున్నారు. అందుకే బన్నీ ఫాన్స్ కూడా ఈ విషయంలో ఎలాంటి టెంక్షన్ పడక్కర్లేదంటున్నారు.