Advertisementt

సుమకు 'బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్'

Sat 12th Dec 2020 03:34 PM
suma kanakala,e tv,zee telugu,big celebrity challenge  సుమకు 'బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్'
Suma upcoming TV show Big celebrity Challenge సుమకు 'బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్'
Advertisement
Ads by CJ

ఇప్పటివరకు ఈ టివి లో స్టార్ మహిళగా, జీన్స్, క్యాష్ ప్రోగ్రామ్స్ కి యాంకర్ గా, స్వరాభిషేకం షోకి యాంకర్ గా అదరగొట్టేసిన సుమ కనకాల అంటే ప్రతి బుల్లితెర ప్రేక్షకుడు అభిమానులే. చిన్నా లేదు, పెద్దా లేదు.. ముసలి లేదు.. ముతక లేదు, యూత్ లేదు.. ఏజ్ లేదు ఏ ప్రేక్షుకులైన సుమ షోకి ఫాన్స్ అవ్వాల్సిందే. సుమ యాంకరింగ్ నచ్చనివారుండరు. అంత చక్కటి అభినయం, వఖ్చాతుర్యం సుమ సొంతం. అందమైన డ్రెస్సులతో ఆకర్షణగా కనబడే సుమ డ్రెస్సింగ్ స్టయిల్ ని ఫాలో అవ్వని మహిళలు ఉండరు. ఈమధ్యన సుమక్క వంటల ప్రోగ్రాం కూడా యూట్యూబ్ లో స్టార్ట్ చేసిన సుమ కనకాల కి ఓ ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. నిర్మాతగా పెద్దగా సక్సెస్ కానీ సుమ కనకాలకి ఈటీవీలో ఉన్న కంఫర్ట్ మరో ఛానల్ లో లేదు అనుకోవాలి. జెమిని, స్టార్ మా ఇలా ఈటివి తో చేసిన ప్రయాణం ఏ ఛానల్ లోనూ చెయ్యలేదు.

కానీ తాజాగా సుమ కామనకాల జీ తెలుగు లోకి అడుగుపెట్టబోతుంది. అది కూడా సెలెబ్రిటీ ఛాలెంజ్ షో తో. సుమ కనకాల ఎంట్రీని బాహుబలి రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చి ఆ షో మీద హైప్ క్రియేట్ చేస్తున్నారు జె తెలుగు వారు. ఆవిడ అడుగు పెడితే ఆనందమే అడుగుపెట్టినట్టు ఉంటాది. ఆవిడా మైక్ పడితే సెటైర్స్ కి సైతం చమట ధార కడతాది. ఆమె పంచ్ లకు భాష కూడా బాంచన్ అవుతాది. ఆమె ఇంటి పేరు కనకాల, TRP లు అన్ని ఆవిడ వెనకాల, నా అక్క బుల్లితెర మెగా స్టార్ అంటూ యాంకర్ రవి వాయిస్ ఓవర్ తో సుమ షోకి  పబ్లసిటీ మొదలు పెట్టారు జీ తెలుగు వాళ్ళు. మరి ఈటివి లో దున్నేసిన సుమ ఇప్పుడు జీ ఛానల్ ని కూడా ఏలబోతుందన్నమాట. సుమ యాంకర్ గా రాబోయే బిగ్ సెలబ్రిటీ ఛాలంజ్ షో త్వరలోనే జీ తెలుగులో ప్రసారం కాబోతుంది.

Suma upcoming TV show Big celebrity Challenge:

Suma Big celebrity Challenge Promo goes viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ