టెన్నిస్ స్టార్ గుత్తా జ్వాలా కాంట్రవర్సీ క్వీన్. ఆమె ఆట కన్నా ఎక్కువ కాంట్రవర్సీలతోనే హైలెట్ అయ్యింది. కోచ్ పుల్లెల గోపీచంద్ విషయంలో రచ్చకెక్కిన జ్వాలా గుత్తా ప్రేమ, పెళ్లి విషయంలోనూ అంతే హైలెట్ అయ్యింది. చేతన్ ఆనంద్ తో ప్రేమ, పెళ్లి, విడాకుల తర్వాత చాలా రోజులకి గుత్తా జ్వాలా తమిళ హీరో విష్ణు విశాల్ ప్రేమలో పడింది. చాన్నాళ్లు సీక్రెట్ గా మెయింటింగ్ చేసిన వాళ్ళ ప్రేమ సడన్ గా సోషల్ మీడియాకెక్కింది. అయితే మొన్నామధ్యనే ఎంగేజ్మెంట్ చేసుకున్న గుత్తా జ్వాలా - విష్ణు విశాల్ లు పెళ్ళికి రెడీ అయ్యారు. మధ్యలో గుత్తా జ్వాలా టెన్నిస్ అకాడమీ స్టార్ట్ చెయ్యడం.. దానికోసం హడావిడి చెయ్యడం జరిగింది. అయితే గుత్తా జ్వాలా పెళ్లి విషయం, పెళ్లి డేట్ విషయం మాత్రం ఎక్కడా వినబడలేదు.
అయితే తాజాగా గుత్తా జ్వాలా త్వరలోనే కాదు కాదు.. ఇపుడే పెళ్లి పీటలెక్కబోతుంది. ప్రస్తుతం గుత్తా జ్వాలా మెహిందీ వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా జరుగుతున్నాయి. ఆ విషయాన్ని స్వయంగా విష్ణు విశాల్ సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో గుత్తా జ్వాలా పెళ్లి చేసుకోబోతున్నట్టుగా తెలిసింది. అసలు గుత్తా కానీ, విష్ణు కానీ తమ పెళ్లి విషయాన్ని ఇప్పటివరకు సీక్రెట్ గా దాచి ఇప్పుడు రివీల్ చేయడం కాస్త ఆశ్చర్యకర విషయమే. మరి ప్రస్తుతం గుత్తా జ్వాలా - విష్ణు విశాల్ మెహిందీ వేడుకల ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి రేపీపాటికీ వాళ్ళ పెళ్లి ఫొటోస్ కూడా వచ్చేస్తాయేమో.