Advertisementt

బీచ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని ఉందట!

Fri 11th Dec 2020 12:12 PM
rakul preet,destination wedding,beach wedding  బీచ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని ఉందట!
Rakul Seeks These Qualities In Her Partner! బీచ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని ఉందట!
Advertisement
Ads by CJ

ఈమధ్యన చాలామంది హీరోయిన్స్ డెస్టినేషన్ వెడ్డింగ్ కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. టాలీవుడ్ సమంత గోవా బీచ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటే.. దీపికా, అనుష్క శర్మలు లాంటి బాలీవుడ్ హీరోయిన్స్ కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ ని సెలెక్ట్ చేసుకున్నారు. రెండు రోజుల క్రితమే టాలీవుడ్ సూర్యకాంతం నిహారిక రాజస్థాన్ ఉదయపూర్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంది. మరి తాజాగా మరో హీరోయిన్ కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ మాత్రమే కాదు.. బీచ్ లో పెళ్లి చేసుకోవాలనుకుంటుందట. ఆమె ఎవరో కాదు.. రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం తెలుగులో రెండు, బాలీవుడ్ లో రెండు సినిమాలతో బాగా బిజీ అయిన రకుల్ పై డ్రగ్స్ కేసు నడుస్తుంది. అయితే తాజాగా పెళ్లి కూతురు గెటప్ లో మ్యాగజైన్ ఫోటో షూట్ చేయించిన రకుల్ ఓ మీడియా ఛానల్ తో మట్లాడుతూ తనకు నచ్చే వాడు, కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పుకొచ్చింది.

ఇప్పటివరకు ప్రేమలో పడని రకుల్ కి ప్రేమంటే, పెళ్లంటే ప్రత్యేకమైన గౌరవం ఉందట. నాకు కాబోయే భర్తకు జీవితం మీద స్పష్టత ఉండాలి. అభిరుచి ఉండాలి. సాంప్రదాయమైన కుటుంబం నుండి వచ్చిన నాకు.. మా నాన్న ఆర్మీ లో ఉండడంతో.. అలాంటి వాతారవరణం అలవాటైంది. అలాగే ఆరోగ్యకరమైన లైఫ్ స్టయిల్ ని ఫాలో అయ్యేవాడు దొరికితే డెస్టినేషన్ వెడ్డింగ్ అది కూడా బీచ్ లో పెళ్లి చేసుకోవాలని ఉంది అంటూ తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో, అలాగే తన పెళ్లి ఎక్కడ జరగాలనుకుంటుందో బయట పెట్టింది రకుల్.

Rakul Seeks These Qualities In Her Partner!:

Rakul wants a destination wedding!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ