Advertisementt

F3 హీరోయిన్స్ ధమాకా! భార్యలు - ప్రియురాళ్లు!

Sat 12th Dec 2020 09:35 AM
anil ravipudi,venkatesh,varun tej,f3,thamannaah,mehreen  F3 హీరోయిన్స్ ధమాకా! భార్యలు - ప్రియురాళ్లు!
F3 Heroine Dhamaka! Wifes and Girlfriends! F3 హీరోయిన్స్ ధమాకా! భార్యలు - ప్రియురాళ్లు!
Advertisement
Ads by CJ

అనిల్ రావిపూడి తెరకెక్కించిన కామెడీ ఎంటర్టైనర్ F2 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో దిల్ రాజు F3 ని భారీ లెవల్లో భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కించే ప్లాన్ లో టీం ఉంది. ఇప్పటినుండే అనిల్ రావిపూడి ఎఫ్ 3 పై అంచనాలు పెంచేస్తున్నాడు. కామెడీ నవ్వుల వ్యాక్సిన్ వచ్చేస్తుంది అంటూ ఊరిస్తున్నాడు. వచ్చే వారంలో పూజా కార్యక్రమాలతో మొదలు కాబోతున్న ఎఫ్ 3 సినిమాలో వెంకటేష్ - వరుణ్ తేజ్ లతో పాటుగా మరో హీరో కూడా ఉండబోతున్నాడనే టాక్ ఉండగా.. ఎఫ్ 2 లో కామెడీ బ్రదర్స్ గా కామెడి పండించిన వెంకీ - వరుణ్ లు ఎఫ్ 3 లోను మ్యాజిక్ చేస్తారట. ఎక్కడా కామెడీ మిస్ కానీ కేరెక్టర్స్ ని అనిల్ వాళ్ళ కోసం రాసుకున్నాడట.

అయితే ఈసారి అనిల్ రావిపూడి కేవలం కామెడీని మాత్రమే నమ్ముకోవడం లేదట. గ్లామర్ ని కూడా నమ్ముకుంటున్నాడట. ఎఫ్ 2 లో తమన్నా, మెహ్రీన్ లతో బికినీ షో చేయించిన అనిల్.. ఎఫ్ 3 లో వెంకీ ఓ గర్ల్ ఫ్రెండ్, వరుణ్ కి ఓ గర్ల్ ఫ్రెండ్ ని తీసుకురాబోతున్నాడట. వెంకీ వైఫ్ గా తమన్నా, వరుణ్ వైఫ్ గా మెహ్రీన్ నటిస్తారని.. ప్రియురాళ్లుగా మరో ఇద్దరు హీరోయిన్స్ ని అనిల్ తీసుకురాబోతున్నాడట. అంతేకాకుండా ఐటెం గర్ల్ గా మరో టాప్ హీరోయిన్ ని ఎఫ్ 3 లోకి తేబోతున్నాడట అనిల్. మరి ఈ లెక్కన ఎఫ్ 3  కి ఐదుగు హీరోయిన్స్ అన్నమాట. అంటే ఎఫ్ 3 మొత్తం హీరోయిన్స్ ధమాకా. వెంకటేష్ - వరుణ్ లు భార్యలకు తెలియకుండా లవర్స్ తో చేసే కామెడీ రచ్చ సినిమాకి హైలెట్ అంటున్నారు.

F3 Heroine Dhamaka! Wifes and Girlfriends!:

More Heroines in F3

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ