Advertisementt

నయన్ - సామ్ ఈగో క్లాషా.. అలాంటిదేం లేదే!

Fri 11th Dec 2020 08:44 PM
kaathu vaakula rendu kadhal,samantha,nayanatara,vignesh shivan,vijay sethupathi  నయన్ - సామ్ ఈగో క్లాషా.. అలాంటిదేం లేదే!
Nayanatara - Samantha Ego Clash .. No such thing! నయన్ - సామ్ ఈగో క్లాషా.. అలాంటిదేం లేదే!
Advertisement
Ads by CJ

సమంత ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉంటుంది. ఆహా ఓటిటి కోసం టాక్ షో తో పాటుగా హిందీ వెబ్ సీరీస్ లో నటించిన సమంత తమిళంలో ఒప్పుకున్న ఓ సినిమా పూర్తి చెయ్యాల్సి ఉంది. అయితే లాక్ డౌన్ కి ముందు ఆ సినిమా నుండి సమంత తప్పుకుందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. సమంత - నయనతార - విజయ్ సేతుపతి హీరో హీరోయిన్స్ గా నయన్ ప్రియుడు విగ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న కాతువక్కుల రెండు కాదల్ సినిమా షూటింగ్ స్పాట్ లో నయనతారకి సమంతకి ఈగో క్లాష్ రావడంతో సమంత ఆ సినిమా నుండి తప్పుకుందనే టాక్ నడిచింది. అయితే లాక్ డౌన్ తో సినిమా షూటింగ్ ఆగిపోయినా.. సమంత ఆ సినిమా చేయడం లేదనే అన్నారు.

ఎందుకంటే కాతువక్కుల రెండు కాదల్ టీం కూడా సమంత తప్పుకుంది అని కానీ, ఉంది అని కానీ ట్వీట్ చెయ్యకపోయేసరికి సమంత తప్పుకుంది అనే న్యూస్ కి బలం చేకూరింది. కానీ  తాజాగా సమంత కాతువక్కుల రెండు కాదల్ నుండి తప్పుకోలేదని.. సమంత కూడా  ఉందని చిత్ర బృందం చెప్పకనే చెప్పింది. కరోనా లాక్ డౌన్ ముగిసిన తర్వాత సినిమా షూటింగ్స్ ప్రారంభమైనట్టుగా.. విగ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న కాతువక్కుల రెండు కాదల్ షూటింగ్ మళ్ళీ పూజ కార్యక్రమాలతో మొదలయ్యింది. ఆ ఫొటోస్ ని ట్విట్టర్ లో పోస్ట్ చేసిన చిత్ర బృందం నయనతారతో పాటుగా విజయ్ సేతుపతి అలాగే సమంత ని కూడా టాగ్ చెయ్యడంతో.. కాతువక్కుల రెండు కాదల్ నుండి సమంత తప్పుకోలేదు, అలాగే నయన్ కి సామ్ కి ఎలాంటి ఈగో క్లాష్ కాలేదని చిత్ర బృందం తేల్చేసింది.

Nayanatara - Samantha Ego Clash .. No such thing!:

Nayan - Sam - Vijay Sethupathi 'Kaathu Vaakula Rendu Kadhal' Shooting update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ