Advertisementt

త్రివిక్రమ్ సెంటిమెంట్ వదిలేసాడా?

Fri 11th Dec 2020 08:20 PM
ntr,trivkram,raja vachhinadu,ayinanu poyiravale hastinaku  త్రివిక్రమ్ సెంటిమెంట్ వదిలేసాడా?
Ntr -Trivkram Movie title fixed? త్రివిక్రమ్ సెంటిమెంట్ వదిలేసాడా?
Advertisement
Ads by CJ

దర్శకుడు త్రివిక్రమ్ కి చాలా సెంటిమెంట్స్ ఉంటాయి. హీరోయిన్స్ ని రిపీట్ చెయ్యడం దగ్గరనుండి.. టైటిల్ వరకు చాలాసార్లు త్రివిక్రమ్ సెంటిమెంట్స్ ఫాలో అవుతుంటాడు. టైటిల్ విషయంలో త్రివిక్రమ్ అ అనే సెంటిమెంట్ ని పెట్టుకుని.. అ అక్షరం ముందు వచ్చేట్టుగా టైటిల్ పెడతాడు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, జల్సా, ఖలేజా లాంటి సినిమాల పక్కనబెడితే త్రివిక్రమ్ అ తో పెట్టిన టైటిల్స్ చాలానే ఉన్నాయి. తాజాగాను త్రివిక్రమ్ అ సెంటిమెంట్ ని బ్రేక్ చేయబోతున్నాడట. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీకి అయినను పోయి రావాలె హస్తినకు అనే టైటిల్ అనుకున్నారు. ఫైనల్  గా ఆ టైటిల్ పెడతారని అన్నారు.

కానీ తాజాగా ఎన్టీఆర్ సినిమాకి త్రివిక్రమ్ వేరే టైటిల్ పెడుతున్నాడట. అది కూడా రాజా వచ్చినాడు అనే టైటిల్ ని నిర్మాతలు అంటే హారిక అండ్ హాసిని మరియు కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ వాళ్ళు రిజిస్టర్ చేయించారట. ఆ టైటిల్ ఎన్టీఆర్ సినిమాకే అంటున్నారు. దమ్ము సినిమాలో రాజు వచ్చినాడో అనే సాంగ్ ఉంటుంది. ఇప్పుడు ఆ సాంగ్ లోని లిరిక్ నే ఎన్టీఆర్ సినిమాకి టైటిల్ గా పెడుతున్నారట. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ రాజకీయాలను టచ్ చెయ్యబోతున్నాడనే టాక్ ఉంది. అందుకే ఎన్టీఆర్ సినిమాకి అయినను పోయిరావలె హస్తినకు టైటిల్ ఫిక్స్ అనుకున్నారు. విదేశాల్లో ఉన్న ఎన్టీఆర్ ఇండియాకి రావడమే కాదు... ఒక నాయకుడిగా, ఒక రాజులా ఎలా మారాడనేది ఏ సినిమా కథ కాబట్టి దీనికి రాజు వచ్చినాడు అనే టైటిల్ ని ఫిక్స్ చేయబోతున్నారట.

Ntr -Trivkram Movie title fixed?:

NTR - Trivikram Movie Title 'Raja Vachinadu'?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ