నిహారిక పెళ్లి అంగరంగ వైభవంగా రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరిగింది. మెగా హీరోలైన చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు, వరుణ్ తేజ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, శిరీష్, సాయి ధరమ్ తేజ్ అందరూ ఒకే ఫేమ్ లో సందడి చేసారు. నిహారిక మెహిందీ, సంగీత్ అన్ని వైభవంగానే జరిపించారు. ఇక పెళ్లినే ఇంట గ్రాండ్ గా డెస్టినేషన్ వెడ్డింగ్ గా చేసిన నాగబాబు కూతురు నిహ రిసెప్షన్ వేడుకలని డిసెంబర్ 11 న హైదరాబాదులో నిర్వహించున్నారు. సినిమా ప్రముఖులు, రాజకీయనాయకులు మధ్యన నిహారిక - చైతన్యల రిసెప్షన్ నిర్వహించబోతుంది మెగా ఫ్యామిలీ.
ఇక పెళ్లి రాజస్థాన్ లో, రిసెప్షన్ ని హైదరాబాద్ లో జరుగుతుండగా.. నిహారిక పెళ్లి తర్వాత ఏ దేశానికీ హానిమూన్ వెళ్లబోతుంది అనే క్యూరియాసిటీ ఇప్పుడు అందరిలో మొదలైంది. నిహారిక జంట పెళ్లి అవగానే హనీమూన్ కి ఎక్కడ, ఏ ప్లేస్ ని సెలెక్ట్ చేసుకుంటుందో అంటున్నారు. అయితే నిహారిక పెళ్లి, రిసెప్షన్ తర్వాత హనీమూన్ కన్నా ముందు అన్నవరం సత్యన్నారాయణ స్వామి సన్నిధిలో మొక్కు తీర్చుకోవడానికి నూతనవధూవరులతో నాగబాబు ఫ్యామిలీ, పెళ్ళికొడుకు ఫ్యామిలీలు అన్నవరం వెళ్ళబోతున్నారనేది తాజా సమాచారం. ఆ తరవాతే హనీమూన్ విషయం బయటపెడుతుందట ఈ జంట.